– సామాన్యుడి మనోభావాన్ని తెలుసుకున్న మంత్రి అచ్చెన్న
– టీ దుకాణ యజమానితో ముచ్చటించిన అచ్చెన్న
బూర్జ: సామాన్యుడి మనోభావాలు తెలసుకోవాలన్న ఆలోచనతో మన్యం జిల్లా పార్వతీపురం పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తిరుగు ప్రయాణంలో బూర్జమండలం, మదనాపురం కూడలి వద్ద టీ దుకాణంలో సామాన్యులతో
మాట్లాడారు.
మంత్రి హోదాను మరిచి సామాన్య వినియోగ దారుడిగా టీ దుకాణం వద్ద కూర్చున్న మంత్రి అచ్చెన్న టీదుకాణం వద్ద టీ తాగుతూ యజమానితో మాటా మంతి కలిపారు. ఆయన జీవన విదానాన్ని అడిగి తెలసుకున్న అచ్చెన్న కు అతని మనోభావాన్ని కూడా తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో మెదిలింది.
దీనితో మాటా మంతి కొనసాగిస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన అందిస్తున్న సంక్షేమం అభివృద్ధిపై మంత్రి ఆరా తీశారు. టీ దుకాణం యజమాని ఏడాది పాలనపై తన మనోగతాన్ని తెలుపుతూ కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తపరిచాడు.