ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, మార్చి 28: ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి భారీ మెజారీతో విజయం సాధించబోతున్నారని ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని, కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. అందుకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టరాని, రానున్న రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.

షాద్ నగర్ లో 100% శాతం పొలింగ్ పూర్తి: షాద్ నగర్ తహశీల్దార్ వెల్లడి
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం వరకు 100 శాతం పోలింగ్ పూర్తయినట్టు ఫరూక్ నగర్ మండల తహాసిల్దార్ పార్థసారథి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో 10 మండలాలకు సంబంధించి జరుగుతున్న ఓటింగ్ లో 100 శాతం పూర్తి కావడం విశేషం.
ఇందులో మహిళా ఓటర్లు 94 మంది, పురుష ఓటర్లు 75 మంది మొత్తం 171 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.

నియోజకవర్గంలోని ఆరు మండలాలు ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగుడతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఆమన్ గల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ ఓటర్లు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Leave a Reply