Suryaa.co.in

Telangana

జిల్లా మైనార్టీ అధికారులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

-నిధులు మంజూరైనా పనులు ఎందుకు మొదలు పెట్టలేదని సీరియస్
-ధర్మపురిలో మాత్రమే పనులు పూర్తి
– వాడి వేడిగా DMWO సమావేశం

మైనార్టీ కార్పొరేషన్ శాఖా జిల్లా అధికారులపై రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హజ్ భవన్ లో బుధవారం నాడు నిర్వహించిన DMWO సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిది గా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పదవి నుంచి తప్పుకుంటా మని బావిస్తే రాత పూర్వకంగా ఇచ్చి తప్పు కోవచ్చని సూచించారు. జిల్లాల్లో మైనారిటీ శాఖ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తికి అధికారులు శ్రద్ద వహించాలన్నారు.

కొన్ని జిల్లాల్లో టెండర్లు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. కేవలం తాను ప్రాతినిద్యం వహిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాత్రమే పనులు పూర్తి చేయడం ఏంటని.. అన్ని జిల్లాల్లో త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని అదేశించారు.

అంతే కాకుండా మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్సీయల్ వసతి గృహలను జిల్లా మైనార్టీ కార్పొరేషన్ అధికారులు తనిఖీ చేస్తూ… విమర్శలకు తావివ్వ కుండా చూడాలన్నారు. ప్రతీ నెల అధికారులు పనుల పురోగతి పై రివ్యూ నిర్వహించి..మూడు నెలలకు ఒక సారి రాష్ట్ర స్థాయిలో సమావేశం సమీక్ష నిర్వహిస్తా మని మంత్రి చెప్పారు.

ఈ సమావేశం లో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్, ప్రిన్సిపాల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, హజ్ బోర్డు చైర్మన్ సలీం,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఖాజా ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE