Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి సంధ్యారాణి గన్ మన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు

విజయవాడ: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గన్ మన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది. రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళుతుండగా ఆయన బ్యాగ్ మాయమయింది. ఆ బ్యాగ్ లో 30 బుల్లెట్లు ఉండే మేగజీన్ ఉండడంతో ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. రమణపై సస్సెన్షన్ వేటు వేశారు. సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనంలో రమణ రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం తన రైఫిల్ ను జిల్లా కేంద్రంలో అప్పగించారు. అయితే బుల్లెట్లు ఉన్న మేగజీన్ ను మాత్రం అప్పగించలేదు.

LEAVE A RESPONSE