Suryaa.co.in

Andhra Pradesh

జగన్ మెప్పుకోసమే మంత్రి సురేశ్ బట్టలిప్పి అర్థనగ్న ప్రదర్శనలు

•సురేశ్ తనచర్యతో దళితజాతిని అవమానించాడు. తక్షణమే తప్పు ఒప్పుకొని మంత్రి దళితులకు క్షమాపణ చెప్పాలి
• సురేశ్ తండ్రి దళితుల ఆత్మగౌరవం కోసం గుర్రాలపై తిరిగితే, నేడు కొడుకు దళితుల ఆత్మగౌరవాన్ని జగన్ కు తాకట్టుపెట్టడానికి బట్టలిప్పి తిరిగాడు
• చంద్రబాబు ఎన్నినియోజకవర్గాల్లో పర్యటించినా ఏమంత్రి చొక్కాలు విప్పలేదు. సురేశ్ కే ఆ పరిస్థితి ఎందుకొచ్చింది
• సురేశ్ చొక్కాలు విప్పింది జగన్ భయంతోనా..లేక సీబీఐ భయంతోనా?
మాజీమంత్రి కే.ఎస్.జవహర్

యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనలో జరిగిన రాళ్లదాడి తాడేపల్లి ప్యాలెస్ పథకంలో భాగంగా జరిగిందేనని, ఎన్.ఎస్.జీ కమాండోల రక్షణలో ఉన్న చంద్రబాబుపై దాడిచేయించేం దుకు ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన గూండాలకు రక్షణగా, ముందు దళితుల్ని పెట్టడమనేది కూడా కుట్రలో భాగంగా జరిగిందేనని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ అభిప్రాయపడ్డారు. తననివాసం నుంచి ఆయన శనివారం జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లో నే మీకోసం…!

“చంద్రబాబునాయుడిపై దాడిచేసి, ఏదోఒక ఘోరంజరిగితే, ఆనేరాన్ని ఆయనకు అంటగట్టి, ఆయన్ని దళితద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నంచేశారు. యర్రగొండపాలెంలో ప్రతిపక్షనేతపై దాడిజరుగుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే స్పందిచంలేదు. వారితీరు ముమ్మాటికీ దుర్మార్గమనే చెప్పాలి. దళితుల్ని ముందుపెట్టి, కిరాయిమూకలతో చంద్రబాబుపై రాళ్లేయిం చారు. అప్పుడు ప్రతిపక్షనేతను కాపాడటానికి ఎన్.ఎస్.జీ కమాండోలు కాల్పులు జరిపితే దళితులే బలవుతారనే దుర్మార్గపుకుట్రకు జగన్ పథకరచన చేశాడు. అమాయక దళితుల్ని బలిచేయాలనుకున్న జగన్ కుట్రలో సురేశ్ పావుగా మారడం దళితజాతికే సిగ్గుచేటు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రిసురేశ్ ఏ1గా ఉంటే, అతని భార్య ఏ2గా ఉంది
మంత్రి ఆదిమూలపు సురేశ్ చివరకు అర్థనగ్నప్రదర్శనలు చేసేస్థాయికి దిగజారాడు. సురేశ్ తండ్రి గుర్రాలపై తిరిగి, దళితులఆత్మగౌరవం కోసం పనిచేస్తే, ఇప్పుడు మంత్రిగా ఉండికూడా సురేశ్ గుడ్డలువిప్పి అర్థనగ్న ప్రదర్శనలు ఇవ్వడంసిగ్గుచేటు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సురేశ్ ఏ1గా, అతనిభార్య ఏ2గా ఉన్నకేసుని చూపించి, జగన్ మంత్రిని భయపెట్టి, నిన్న తనపని చేయించుకున్నాడు. జగన్ కు భయపడే మంత్రి అర్థనగ్నప్రదర్శనలు చేశాడు. సురేశ్ తో చొక్కాలు విప్పించిన జగన్, చంద్రబాబు పులివెందుల వెళ్లినప్పుడు తానెందుకు ఆపనిచేయలేదో చెప్పాలి. చంద్రబాబు ఏ నియోజకవర్గంలో తిరిగినా అక్కడున్న జగన్ సామాజికవర్గపు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ బట్టలువిప్పి రోడ్లపైకి రాలేదు. సురేశ్ మాత్రమే అలాఎందుకొచ్చాడో, అతనే ఆలోచించుకోవాలి. దళితుల ఆత్మగౌరవాన్ని నడివీధుల్లో అపహాస్యం చేసిన ఘనత సురేశ్ కే దక్కింది. సురేశ్ ఎప్పుడో విప్పాల్సిన చొక్కాలు నిన్న జగన్ కోసం విప్పి, దళితుల పరువు తీశాడు.

జగన్ ప్రభుత్వంలో దళితులకు వ్యతిరేకంగా జరిగిన దాడులు, అరాచకాలకు నిరసనగా సురేశ్ చొక్కా విప్పితే దళితజాతి హర్షించేది
జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుకమాఫియాపై ప్రశ్నించిన వరప్రసాద్ అనే యువకుడికి వైసీపీనేతలు శిరోముండనం చేయించినప్పుడు, దానికి నిరసనగా సురేశ్ చొక్కా విప్పితే దళితజాతి హర్షించేది. డాక్టర్ సుధాకర్ ని బలితీసుకున్నప్పుడు, దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు, కిరణ్ కుమార్, ఓంప్రతాప్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటివారిని జగన్ ప్రభుత్వం బలితీసుకున్నప్పుడు సురేశ్ అర్థనగ్నప్రదర్శనలు చేసుంటే దళితులు అతన్ని మెచ్చుకునేవారు. తప్పుడుకేసులు పెట్టి విచారణపేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, నన్ను నేలపై కూర్చోబెట్టినప్పుడు సురేశ్ మాట్లాడిఉంటే అతన్ని మెచ్చుకునేవా ళ్లం. దళితుల సబ్ ప్లాన్ ఆపేసినప్పుడు సురేశ్ ఏంచేశాడు? బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, గురుకులపాఠశాలలు జగన్ రద్దుచేసినప్పుడు ఆదిమూలపు ఎక్కడున్నాడు? గురుకుల పాఠశాలలకు జీఎంసీబాలయోగి పేరుతీసేసినప్పుడు సురేశ్, ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు? దళితులకుచెందిన 12వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ను వైసీపీప్రభుత్వం లాక్కొని, ఇళ్లపట్టాలకు ఇస్తుంటే సురేశ్ ఎందుకు నోరెత్తలేదు? డాక్టర్ అచ్చెన్నను, నెల్లూరు లో నారాయణ అనే దళితుణ్ణి ప్రభుత్వం బలితీసుకుంటే సురేశ్ ఎందుకు మాట్లాడ లేదు? అనూష, నాగమ్మ, డాక్టర్ అనితారాణి వంటి దళితమహిళల్ని జగన్ బలితీసుకుంటే సురేశ్ కు ఆ దారుణాలు కనిపించలేదా? దళితులకోసం ఎన్నడూఏమీ చేయని, వారిపక్షాన ఏనాడూజగన్ ను ప్రశ్నించలేని సురేశ్ అసమర్థత, చేతగాని తనాన్ని నిన్న జగన్ వాడుకున్నాడు.

సురేశ్ చొక్కాలు విప్పడానికి కారణం జగన్ భయమా.. లేక తన ఆస్తులపైకి సీబీఐ వస్తుందన్న భయమా? 
అవినీతి, అక్రమార్జన కేసుల్లో సీబీఐ విచారిస్తుందేమోనన్న భయంతో సురేశ్ చొక్కాలు విప్పాడా? లేక జగన్ భయపెడితే విప్పాడా అన్నదికూడా తేలాలి. జగన్ అధికారంలోకి రాగా నే చంద్రబాబుప్రత్యేకంగా దళితులకోసం అమలుచేసిన 28 పథకాల్ని రద్దుచేసినందుకు నిర సనగా చొక్కాలువిప్పాలనే ఆలోచన ఏనాడూ సురేశ్ కు ఎందుకురాలేదు? మాదిగబిడ్డగా ఉండి లిడ్ క్యాప్ భూమలు అన్యాక్రాంతమవుతున్నా కూడా ఏనాడు నోరెత్తని సురేశ్ ను చూస్తుంటే జాలేస్తోంది. సురేశ్ కు సంపాదన దండిగా ఉంది. మంత్రిగా పనిచేశాడు.. ఇంకా ఏంచేయాలని చొక్కాలు విప్పి దళితజాతి పరువుతీశాడు? దళితులపై లోకేశ్ చేశాడని జగన్, అతనిమీడియా, అతనిప్రభుత్వంచేస్తున్న దుష్ప్రచారమంతా పచ్చి అబద్ధమే. చంద్ర బాబుగారు దళితులకోసం మలుపు, ముందడుగు వంటి గొప్ప పథకాలు అమలు చేసినప్పు డు సురేశ్ ఎక్కడో ఢిల్లీలో చదువుకుంటున్నాడు. సురేశ్ తనచర్యతో దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. జగన్, సురేశ్ లాంటి వారుఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా చంద్రబాబుని ఏమీచేయలేరు. సురేశ్ నిన్న జగన్మోహన్ రెడ్డిడైరెక్షన్లో పనిచేశాడు తప్ప, దళితులకు ఏం ఒరగబెట్టిందిలేదు? సురేశ్ జగన్ కు విశ్వాసపాత్రుడు తప్ప, మాదిగలకు కాదు. తాను చేసిన బుద్ధిలేని పనితో దళితులు బాధపడ్డారని గ్రహించి, మంత్రి సురేశ్ తక్షణమే వారికి క్షమాపణలు చెప్పాలి” అని జవహర్ డిమాండ్ చే శారు.

LEAVE A RESPONSE