పాలన ఆరంభంలో మోదీని కలిసి అడిగిన అంశాలు
పాలన చివర మోదీని కలిసి అడిగిన అంశాలు
Both are same
కట్టు’కథలు’
కట్టని మెడికల్ కాలేజీలు కట్టినట్లు ఫ్యాన్స్ గల్లీలో కట్టుకథలు చెబుతుంటే కట్టబోయే కాలేజీలకు సహకారం ఇవ్వమని ఢిల్లీలో అన్న వినతి. “డబ్బు మీరిస్తే డప్పు మేం కొట్టుకుంటాం”
తాయిలం
మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కి భారతరత్న ఇచ్చిన ఫలితం – ఆరెల్డీ పొత్తుకు సై. యూపీలో ఏడు ఎంపీ సీట్లలో భాజపాకు సానుకూలత- పురస్కారాలు అపాయింట్మెంట్లు ఊరకే ఇవ్వరు
భూ(మ్)
రైల్వే జోన్‌కి భూమి ఇవ్వలేదు అని కేంద్ర మంత్రి & ఇచ్చాం అని జగన్ సర్కార్ మొత్తానికి తేలింది ఏంటంటే ముంపు భూమి ఇవ్వజూపారు – ఓట్లు రాని హామీకి అది ఇవ్వడమే గొప్ప
వేట
ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు దోచేస్తున్నారు అని అన్నపై చెల్లి మాట. ఇంట్లో చెల్లి ఇలా పగబడుతుంది వెంటాడుతుంది అని కలలో కూడా ఊహించలేదు.
Mood of AP
నాలుగైదు మువీ కలెక్షన్లు ఇచ్చే సైట్లు చూస్తే – యాత్ర2 1.5 కోటి షేర్ యాత్ర1 (3 కోట్లు) లో సగం. విశ్వసనీయత సగం డ్రాప్. మాటలు ఎక్కువ వాస్తవం తక్కువ, జగన్ యాక్షన్‌కి జనం రియాక్షన్ కరువు & సోషియల్ మీడియాలో ప్రచారానికి గ్రౌండ్ లో వాస్తవానికి ఇది ఒక శాంపిల్ పీస్.
శీను B A.
మా అన్న ఈగో & స్వార్థం వలన అందరూ జనుపల్లి (కోడికత్తి) శీను ఐదేళ్ళు జైలులో మగ్గాడు అని ఆడిపోసుకుంటారు కానీ శీను ఈ ఐదేళ్లలో free food free accomodation తో బిఏ పూర్తి చేశాడు అని ఎవరూ అర్థం చేసుకోరు. విద్యకు మా అన్న ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనడానికి ఇదొక see for instance.
మిత్రుని ముఖపుస్తకమ్ గోడ నుంచి
(సుబ్బారావు మారెళ్ల)