జన్నత్ హుస్సేన్ కి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నీటి నివాళి

నేను 1985వ సంవత్సరంలో నెల్లూరు వి.ఆర్. కళాశాల ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు విద్యార్థిని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 13 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు ఆ నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు ఆదేశాలతో, అప్పటి జిల్లా కలెక్టర్ జన్నత్ హుస్సేన్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, నాకు నిమ్మరసం అందించి, ఆమరణ నిరాహారదీక్ష విరమింపచేయడం జరిగింది. అది నా జీవితంలో మరపురాని, మరువలేని అద్భుత ఘట్టం. అప్పటి జిల్లా కలెక్టర్ నేటి ఉదయం మరణించడం నా మనస్సును చాలా బాధించింది. జన్నత్ హుస్సేన్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కన్నీటి నివాళి అర్పిస్తున్నా.

Leave a Reply