వల్లభనేని వంశీ-వంగవీటి రాధా భేటీ.. ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నిన్న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో
pic జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ పరస్పరం కరచాలనంతో పలకరించుకున్న అనంతరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

రాధాను దగ్గరుండి కారులో ఎక్కించిన వంశీ అనంతరం మాట్లాడుతూ.. రాధా తనకు మంచి మిత్రుడని, చాలా రోజుల తర్వాత కలవడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నామని అన్నారు. కాగా, గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు-వంశీ మధ్య వివాదం నెలకొని.. పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న క్రమంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.