ప్రకాశం జిల్లా వైసీపీ నేత ఇంట్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు..

-రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ వినాయక విగ్రహం స్వాధీనం

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.వెంకటేశ్వరరావు ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైంది. అత్యంత అరుదైన ఈ విగ్రహం విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఆయనతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న గోళ్లవిడిపికి చెందిన గ్రామస్థాయి నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయని వెంకటేశ్వరరావు చెప్పడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను తీసుకురావాలని చెబుతూ వారిని విడిచిపెట్టారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు.

Leave a Reply