– లాభాల్లో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లను అంబానీ, అదానిలకు కట్టబెట్టేందుకు మోడీ కుట్ర
– బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోంది
– విద్యుత్ సేవలు అంతంత మాత్రంగానే
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బోయినపల్లి వినోద్ కుమార్ స్పీచ్ లోని ముఖ్య అంశాలు..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుని వస్తున్న ఎలక్ట్రిసిటీ (అమెండ్మెంట్) బిల్ 2022 అండ్ ప్రైవేటైజేషన్ ను టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే రైతులు సామాన్య ప్రజలు ఉపయోగించే విద్యుత్ యూనిట్ ధరలు విపరీతంగా పెరుగుతాయి.
కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరి వల్ల సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది. విద్యుత్ సేవలు అంతంత మాత్రంగానే ఉంటూ టారిఫ్ రేట్లు పెరుగుతాయి. విద్యుత్ ఉద్యోగుల జాతీయ స్థాయి జేఏసీ నవంబర్ 23న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తుంది.
నవంబర్ 23న న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే భారీ సభలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొని విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావాన్ని తెలుపుతారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు అయినా ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, బిహెచ్ఇఎల్, హెచ్ ఏ ఎల్, బీడీఎల్, జాతీయ బ్యాంకులతో సహా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విద్యుత్ సంస్థలు సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చురుకుగా పావులు కదుపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ నిరసించాలి. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. లాభాల్లో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లను అంబానీ, అదాని లకు కట్టబెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.ప్రజా ప్రజా పోరాటాల ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.