– పెనుకొండ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తాం.
– కోటి 53 లక్షల రూపాయలతో మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సవిత
పెనుకొండ: త్వరలో పెనుకొండ కు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని పెనుకొండ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని తెలియజేసిన మంత్రి సవిత .పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే స్టేషన్ రోడ్డుకు వెళ్లే రహదారికోసం 53 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేశారు.
అదేవిధంగా పెనుకొండ లోని మడకశిర రోడ్డు నుండి కోనాపురం వెళ్లే రహదారికి 50 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేశారు
డ్రైనేజ్ కొరకు మరో 50 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేసిన మంత్రి సవిత ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని త్వరలో పెనుకొండ నియోజకవర్గముకు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.
ఐదు సంవత్సరాల్లో చేయని అభివృద్ధి మేము ఆరు నెలల లోనే చేసి చూపిస్తున్నాం. గత వైసిపి ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధి గాలికి వదిలేసారని అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ ఇదే రోడ్డు లోనే వాకింగ్ చేసే వారిని కనీసం ఈ రోడ్ కూడా వేయలేక పోయారని మంత్రి విమర్శించారు.గతంలో కొనాపురం గ్రామానికి రోడ్ వేయమని ఎన్నోసార్లు ధర్నాలు చేసాం,ఈ గుంతల రోడ్ లో వరినాట్లు కూడా వేసి నిరసన తెలిపామని, కానీ గత పాలకులు, అధికారులు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్డు వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు భూమిపూజ చేస్తున్నామని త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..