Suryaa.co.in

Telangana

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్న మోత్కుపల్లి

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు…. ఈరోజు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు.ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయనున్నారు మోత్కుపల్లి. ఆ తర్వాత బషీర్బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు మోత్కుపల్లి. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో మధ్యాహ్నం టిఆర్ఎస్ పార్టీ లో అధికారికంగా చేరనున్నారు.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అంతేకాకుండా కేసీఆర్ ని తెలంగాణ అంబేద్కర్‌గా అభివర్ణించారు. కాగా దళిత బంధు పథకాన్ని చట్టబద్దం చేసి దానికి మోత్కుపల్లిని చైర్మెన్ గా నియమిస్తారన్న చర్చ నడుస్తోంది.

LEAVE A RESPONSE