Suryaa.co.in

Andhra Pradesh National

పి.ఎమ్-ఎస్.హెచ్‌.ఆర్.ఐ పాఠ‌శాలకు విడుద‌ల చేసిన నిధుల‌పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ : పి.ఎమ్.-ఎస్.హెచ్‌.ఆర్.ఐ (PM-SHRI) పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంపిక చేయబడిన పాఠశాలల వివరాలు, ఆ పాఠ‌శాల‌ల‌ అభివృద్దికి జిల్లాల వారీగా మంజూరు చేసిన నిధులు, వాటి వినియోగం తెల‌పాల‌ని ప‌లు ప‌శ్న‌లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సోమ‌వారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర‌ విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య ,అక్షరాస్యత విభాగం ను ప్ర‌శ్నించారు.

ఈ ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి బ‌దులిస్తూ పి.ఎమ్.-ఎస్.హెచ్‌.ఆర్.ఐ ప‌థ‌కం కింద పాఠశాలలు భారత జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలను ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 855 పాఠశాలలు ఎంపిక కాగా, వాటిలో ప్రాథమిక పాఠశాలలు- 35, ప్రాథమికోన్నత పాఠశాలలు -27, సెకండరీ పాఠశాలలు -658, సీనియర్ సెకండరీ పాఠశాలలు – 135 పారదర్శకంగా ఎంపికి చేసిన‌ట్లు చెప్పారు.

ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 855 పి.ఎమ్.-ఎస్.హెచ్‌.ఆర్.ఐ పాఠశాలల కోసం 2023-24, 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో రాష్ట్ర కేంద్ర వాటాలు క‌లుపుకొని మొత్తం 1056.44 కోట్లు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. ఈ మొత్తంలో కేంద్ర వాటా 633.88 కోట్లు, ఇందులో మొత్తం 293.66 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పి.ఎమ్.-ఎస్.హెచ్‌.ఆర్.ఐ పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాన్ రికరింగ్ ఫండ్‌గా మంజూరు చేయబ‌డిన‌ట్లు తెలిపారు.

LEAVE A RESPONSE