Suryaa.co.in

Andhra Pradesh

ప్రధాని,ఇతరులకు కల్తీ మద్యంపై లేఖలు రాస్తా

– వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు

ఢిల్లీ: ‘‘ ప్రజలను బాగా తాగమని లిక్కర్ షాపుల సమయాన్ని కూడా పెంచారు.రాష్ట్రంలో దొరకని Old timer, royal simha, green choice లాంటి బ్రాండ్లు మన రాష్ట్రంలోనే దొరుకుతాయి. హైదరాబాద్ లోని Sgsలో కంపెనీలో టెస్టులు చేయించాము టెస్టుకు పంపించాము, ఇవి మనుషులు తాగడానికి అనుకూలం కాదు అని తేలింది. వొల్కనీన్, అనే పదార్ధం లిక్కర్ లో ఉంది,ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మద్యాన్ని నిషేద్దించండి,మద్యం ద్వారా మనుషులను నిషేద్దించకండి జగన్ గారు! ప్రధాని ఇతరులకు కల్తీ మద్యం పై లేఖలు రాస్తాను ’’ అని వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

మీడియాతో మాట్లాడిన రాజు ఏమన్నారంటే.. రగులుతున్న ఆంధ్ర ఒకవైపు ఉద్యోగులు,మరో వైపు రిటైర్డ్ ఉద్యోగులు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 10 వేల నుంచి 12 వేలు పెన్షన్ లో కోత పడుతుంది.ఉద్యోగులను బెదిరిస్తున్నారు ,సజ్జల మూడు రోజులు టైం ఇచ్చామని అంటున్నారు. చరిత్రలో ఎన్నడూలేని విదంగా కొత్త జీతాలు వద్దు పాత జీతాలు కావాలని అంటున్నారు. ప్రజలు ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు,ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. జిల్లాల జ్వాలలు ఎక్కువ అయ్యాయి. మా పార్టీ బోర్డులు తీసేస్తున్నారు. నరసాపురం లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వానికి ఆఫీసులు దొరకక ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు, అద్దె ఇళ్ళల్లో కలెక్టర్లు, ఎస్పీలు ఉంటే కనీసం గౌరవించే పరిస్థితులు కూడా ఉండవు. రాష్టానికి మూడు రాజధానులు ఉండాలని అంటారు,జిల్లా విషయానికి వస్తే డి సెంట్రలైజ్ అంటున్నాము.ప్రజాలన్నీ గమనిస్తున్నారు. రాజధాని విషయంలో కూడా డీ సెంట్రలైజ్ విధానాన్ని అవలభించండి. ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజలను కలవాలి చాణిక్య నీతిని పాటించాలి. నేను ఉన్నాను,నేను విన్నాను అనే విధంగా ఉండండి.

గోరుముద్దలో గోరు గిచ్చుడు ఎక్కువగా ఉంది, ఎక్కడ జరుగుతుందో ముఖ్యమంత్రి చూడాలి. కేంద్రీయ బండారు టెండర్ వాల్యూ కూడా పెంచారు.. ఒక్కరే టెండర్ వేశారు.గోరుముద్ద స్కిం లో అవతవకాలు జరిగాయి అభియోగాలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి కి తెలిసి జరుగుతుందా?తెలియక జరుగుంతుందో కూడా అర్ధం కావడం లేదు.పిల్లలు తినే కోడిగుడ్లల్లో కూడా అవినీతి జరుగుతుంది. విచారణకు అదేశించాలి అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.

రాబోయే మరో లోన్ స్కాం జరుగుతుంది. టిడ్కో ఇళ్ల నిర్మాణం లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి.దాదాపు 12వేల కోట్లు ఖర్చు చేశారు. మరొక నాలుగు వేల కోట్లు ఎస్.బి ఐ. దగ్గర అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి రాని లోన్ కి లబ్ధిదారులు ఏ విధంగా బాధ్యత వహిస్తారు. ఓటీఎస్ స్కీం పై పోరాడాల్సిన అవసరం ఉంది ,దీని పై అవసరమైతే కోర్టుకు వెళ్ళండి.

రాజద్రోహం కేసు వచ్చింది నేను కోపరేట్ చేస్తానని చెప్పాను. సుప్రీంకోర్టు రూల్స్ ను ఫాలో అవుతాను. రైతు భరోసా కేంద్రాల్లో కంప్యూటర్ లు పని చేయడం లేదు,పంపిణీ చేసిన వారికి డబ్బులు ఇవ్వడం లేదు. ధాన్యం ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి సీఎం జగన్ గారు. సత్తెనపల్లి లో ఉన్న సున్నం ఫ్యాక్టరీలను పొల్యూషన్ అధికారులు మూసివేస్తున్నారు.

పిడుగురాళ్లలో మాత్రం సున్నం ఫ్యాక్టరీలు మూసివేయడం లేదు.దయ చేసి ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలు రోడ్లుఎక్కి బాధ పడుతున్నారు.రాజన్న రాజ్యం అంటే ప్రజలు ఇళ్ళల్లో సంబరాలు చేసుకోవాలి.సరైన పరిపాలన అందించాలి సీఎం జగన్ గారు!

LEAVE A RESPONSE