12న వైసీపీలో చేరనున్న ముద్రగడ?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీ లో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం బరిలో ఉండే ఛాన్స్‌ ఉంది.

పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకే ముద్రగడను సీఎం జగన్  వైసీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.  పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడ పద్మనాభంను బరిలో దింపనున్నారని సమాచారం. తద్వారా కాపు ఓట్లు చీలి పవన్‌కు ప్రతికూలంగా మారుతుందని జగన్ భావన. దీనికోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి ముద్రగడను బరిలో దింపి జనసేనానికి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారట.

Leave a Reply