నడమంత్రపు సిరి

ఒక ఎలుక ఓ రోజు ఒక వజ్రాన్ని మింగేసింది.వజ్రం యొక్క యజమాని ఎలుకను చంపేవాణ్ణి పిలిపించాడు.. వాడు ఎలుకను చంపడానికి గదిలోకి వెళ్ళగానే అలాంటి ఎలుకలు చాలా గుంపుగా ఒక చోటకనిపించాయి,ఒక ఎలుకమాత్రం వాటికి దూరంగా దర్జాగా కూర్చొని ఉంది.ఎలుకలు పట్టేవాడు ఒంటరిగా ఉన్న ఎలుకను ఒకే దెబ్బకు చంపేశాడు.అదే వజ్రాన్ని మింగిన ఎలుక అని గుర్తుపట్టేశాడు….

వ్యాపారి ఆశ్చర్యపోయాడు అన్ని వందల ఎలుకల్లో సరిగ్గా అదే ఎలుక వజ్రాన్ని మింగింది అని ఎలా గుర్తు పట్టావు అని అడిగాడు.అప్పుడు అతను చెప్పిన సమాధానం”ఏముంది సార్ మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళు నెత్తి కెక్కి ఎవరితో కలవకుండా ……. గొప్పవాళ్ళమైనట్టు ఫోజులు కొడతారు .అలా ఫోజులు కొట్టి ఆ ఎలుక తన వారితో కలవకుండా దొరికిపోయింది సార్ ” అన్నాడు.

నడమంత్రపు సిరి వస్తే మూర్ఖులకు పొగరు తలకు ఎక్కి మా అంతటి వారు లేరని ఫీలవుతుంటారు, అందుకే డబ్బున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా కాదు ఎప్పుడు ఒకేలా ఉండడం చాలా మంచిది…
కానీ అలా వుండరు డబ్బు రాగానే నేను అన్న అహం తలకెక్కి విచిత్రాలు పోతారు…..
“చివరికి ఆ ఎలుకకు పట్టిన గతే పడుతుంది”

– ఆర్‌.ఆర్‌.ఆర్‌

Leave a Reply