Suryaa.co.in

Andhra Pradesh

జ‌గ‌న్ ప‌ళ్లు రాల‌గొట్టు జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ

– మంత్రి రోజాకి టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కౌంట‌ర్

“జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అవినీతిని ప్ర‌శ్నిస్తే..మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన‌ట్ట‌ట‌. నా ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ వార్నింగ్‌లు ఇస్తోంది. ప‌ళ్లు రాల‌గొట్టాల్సి వ‌స్తే ముందుగా జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్టాలి ఆంటీ” అని రోజాకి త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా బుధ‌వారం తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రోజూ నాకు చీర‌-గాజులు పంపుతాన‌ని ప్ర‌క‌టించే రోజాకి తెలుగు మ‌హిళ‌లు సారె పెట్టేందుకు వెళ్తే వారిని అరెస్టు చేయించింద‌న్నారు. సాటి మ‌హిళ‌ల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మ‌హిళ‌ల గురించి మాట్లాడ‌టం సిగ్గుచేట‌న్నారు.

న‌న్ను ప‌ళ్లు రాల‌గొడ‌తానంటోన్న జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ చంద్ర‌బాబుని న‌డివీధిలో కొట్టాలి, కాల్చాలంటూ జ‌గ‌న్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ప్పుడు జ‌గ‌న్‌ ప‌ళ్లు రాల‌గొట్టాల్సింద‌న్నారు.
నా త‌ల్లిని అసెంబ్లీలో అవ‌మానించిన‌ప్పుడు ఏమైంది ఈ రోజా? అప్పుడు జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్ట‌లేదు ఎందుకు జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ? అని నిల‌దీశారు.

అవినీతి ఆరోప‌ణ‌ల‌పైనా స్పందిస్తూ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు 16 హౌస్‌ క‌మిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారు. ఒక్క‌టీ నిరూపించ‌లేక‌పోయార‌ని, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైసీపీలో ఉన్న‌ ల‌క్ష్మీపార్వ‌తి కూడా మాపై సుప్రీంకోర్టు వేసిన‌ కేసుల్లో క‌నీసం ఆధారాలు కూడా చూప‌లేకపోవ‌డంతో కేసుల‌ను కోర్టు కొట్టేసింద‌ని తెలిపారు. ఇదీ మా చిత్త శుద్ధి జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూనే మేము మా ఆస్తులు ప్ర‌తీ ఏటా ప్ర‌క‌టిస్తున్నాం. మీ వైసీపీ లో మీరు, మీ 150 మంది దొంగ‌లు కూడా ఆస్తులు ప్ర‌క‌టించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE