సెయింట్ పాల్స్ చర్చిలో నారా లోకేష్ ప్రార్థనలు

మంగళగిరి: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిని యువనేత నారా లోకేష్ ఆదివారం సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. యువనేతను క్రైస్తవ మతపెద్దలు సాదరంగా ఆహ్వానించి ఆశీస్సులు అందించారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తుబోధనలు దోహదపడతాయని, శత్రువులపైన కూడా ఏసుక్రీస్తు చూపిన దయ, క్షమాగుణాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.

Leave a Reply