మరీ వారిపై కేసులు ఉండవా.. సీఎంను ప్రశ్నించిన నారా లోకేశ్

సీపీఎస్ రద్దుపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ జగన్‌ అవగాహన లేకుండా హామీలిచ్చారని సజ్జల, బొత్స చెబుతుంటే వారిపై కేసులు ఎందుకు పెట్టటం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేస్తేనే.. తెలుగుదేశం కార్యకర్తలపై దేశద్రోహం కేసులు బనాయించి ఎలా వేధిస్తారని ప్రశ్నించారు.