-ఉద్యోగాల హామీలిచ్చిన నేతలు ఏ కలుగులో దాక్కున్నారు?
– వాలంటీర్ల ఉద్యోగాలేనా మీరిచ్చేది
– నిలదీసిన నారా లోకేష్
– వైసీపీ నుంచి టిడిపిలో చేరిన యువత
– పసుపు కండువాలు వేసి ఆహ్వానించిన నారా లోకేష్
జగన్ వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ నిలదీశారు. ఎంఏ, ఎంబీఏ, డిగ్రీలు చదివిన వారికి 5 వేలతో వాలంటీర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలివ్వడమేనా జాబులివ్వడమంటే అని ఎద్దేవా చేశారు.
యువత తొలినుంచీ యువతకు పట్టం కడుతోందని, గత ఎన్నికల ముందు వైసీపీ అబద్ధపు ప్రచారానికి లోనయి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన పలువురు యువకులు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా ఆయన జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువత ఇప్పటికయినా జగన్ చేసిన మోసాన్ని గుర్తించి, యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించే టీడీపీని బలపరచాల్సిన చారిత్రక అవసరం ఉందని పిలుపునిచ్చారు. ‘టీడీపీని బలపరచండి. మా కోసం కాదు. మీ కోసం కాదు. రాష్ట్రం కోసం. భావితరాల భవిష్యత్తు కోసం’ అని వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ పరిధిలో ఇస్లాంపేట, ప్రకాశ్ నగర్ ప్రాంతాలకి చెందిన వైసీపీ నేతలు రఫీ, సువర్ణ రాజు, బాలచంద్రుడు ఆధ్వర్యంలో వందమంది యువత శుక్రవారం టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకి పసుపుకండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన యువతని అభినందించారు.
ఈ కార్యక్రమంలో తాడేపల్లి టౌన్ టిడిపి ప్రెసిడెంట్ వల్లభనేని వెంకటరావు, వైస్ ప్రెసిడెంట్ సాంబశివుడు, సెక్రటరీ దారదాస్, టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి జుంజు మరియదాసు, గుంటూరు పార్లమెంట్ టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి రామకృష్ణ బెజ్జం, తాడేపల్లి 7వ వార్డు టిడిపి అధ్యక్షుడు కుందుర్తి కోటేశ్వర రావు, 11వ వార్డు ఇమ్రాన్, 9వ వార్డు చిన్నారావుతోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.