Suryaa.co.in

Andhra Pradesh

భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి ఆలయంలో లోకేష్ పూజలు

మంగళగిరి :- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం మంగళగిరి నియోజకర్గంలోని పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి వార్ల విగ్రహప్రతిష్ట, ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు లోకేష్ కు తీర్ధప్రసాదాలు అందించారు. అంతకముందు తాడేపల్లి పట్టణంలోని ఎడ్ల ఆంజనేయస్వామిని దర్శించుకుని లోకేష్ పూజలు చేశారు.

LEAVE A RESPONSE