జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చా

– టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు: పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు మారిపోతున్న కోవెలమూడి రవీంద్ర మాత్రం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కలియుగ కర్ణుడు.ఇప్పట్టికి పలుమార్లు నియోజకవర్గoలో సీటు ఇవ్వకపోయినా పార్టీని వదలకుండా అండగా ఉన్న వ్యక్తి కోవెలమూడి.

మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అనటానికి నిదర్శనం కోవెలమూడి రాజకీయ పోరాటం అంటూ కొనియాడారు. గత 4సం. లుగా టీడీపీ కార్యకర్తలు పోరాటం చూస్తే నాలో పట్టుదల పెరిగిపోయింది. పోరాటం చేయాలని రాజకీయాలలోకి వచ్చాను.

చంద్రబాబు 40సం. లు గా రాష్ట్రం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పార్టీకోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇరువురు రాష్ట్ర సంక్షేమం కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్న గొప్ప సహృదయులు. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చాను, ఎంపీ గల్లా జయదేవ్ పై రాజకీయ కక్షతో ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం.

చదువుకున్న వారు సైతం ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్నారు అంటే నిరుద్యోగుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.కోవెలమూడి గురించి నాకు తెలిసినంతవరకు చంద్రబాబు తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా,న్యాయం చేయమని కొరతాను అని, మిగతా అంతా చంద్రబాబు చేతులో ఉందని తెలిపారు.

Leave a Reply