Suryaa.co.in

Telangana

రేవంత్ రాజకీయ డ్రామాలో నరసింహారెడ్డి పావు

-ఆంధ్ర పాలకులు విసిరిన పాచిక రేవంత్ రెడ్డి
-కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కమిషన్ పనితీరు
-ఇది ఎంక్వైరీ కమిషన్ కాదు.. రాజకీయ కమిషన్
– ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ డ్రామాలో జస్టిస్ నరసింహారెడ్డి పావుగా మారిండు. చీకటి నిండిన తెలంగాణలో కరెంటు వెలుగు జిలుగులు నింపిన దార్శనికుడు కేసిఆర్. విద్యుత్తు లోటు నుంచి ఉత్పత్తి స్థాయికి ఎదగటం అనేది సాధారణ విషయం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలను, స్వరాష్ట్రంలో నిర్విరామ కరెంటు సౌలభ్యాన్ని తెలంగాణ వాసిగా జస్టిస్ నరసింహారెడ్డి కుటుంబం అనుభవంలో ఉన్నదే.

తెలంగాణ పసికూన ఉన్నప్పుడే రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని ఆంధ్ర పాలకులు విసిరిన పాచిక రేవంత్ రెడ్డి. ఇప్పుడు అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేసిఆర్ కీర్తికి మసి పూయాలనే రాజకీయ దుగ్ధతోనే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చట్ట విరుద్ధమైన ఎంక్వయిరీ కమిషన్ వేశారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలని కాదని, కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కమిషన్ పనితీరు సాగుతున్నది.

ఇది ఎంక్వైరీ కమిషన్ కాదు.. రాజకీయ కమిషన్ అని స్పష్టం అవుతోంది. దీన్ని జస్టిస్ నరసింహారెడ్డి గారి రిటైర్డ్ అనంతర ఉపాధి కోసం భుజాన వేసుకున్న కార్యంగానే భావిస్తున్నాను. విచారణ కమిషన్ గా జస్టిస్ నరసింహారెడ్డి ప్రవర్తన, అనుమానాస్పదంగా ..అక్షేపనీయంగా ఉంది. ఆయన ప్రతి కదలిక రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కొనసాగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ పౌరులు ఎవరు దీన్ని సమర్థించరు. తెలంగాణ బిడ్డగా ఆయన హుందాగా పదవి నుంచి తప్పుకుని తెలంగాణ ఖ్యాతిని ఇమిడింపజేయాలని డిమాండ్ చేస్తున్నాను.

LEAVE A RESPONSE