సంభాషణలకు నవ్వుల జీడి
మాండలికానికి పుట్టించే వేడి
బాపు చిత్రాలకు సరియైన జోడి
కీ.శే. వెంకటరమణ ముళ్లపూడి..!
బతుకు పుస్తకం కోసం
కలం పట్టి కథలు రాసే
వ్యథలను పోగొట్టేందుకు
హాస్య రసాన్ని పండించే..!
బొమ్మల బాపుతో చెలిమి
ముళ్లపూడికి పెరిగే బలిమి
సాక్షితో మొదలైన వారి స్నేహం
గోరంత దీపమై.. బుడుగు వాకిట
ముత్యాల ముగ్గులు వేసింది…!
సంపూర్ణ రామాయణాన్ని తీసారు
సీతాకల్యాణాన్ని వేడుకగా చూపి
శ్రీరామ రాజ్యాన్ని రమణీయంగా
తీశారు.. బాపూ రమణ ఇద్దరు కలసి…!
చిత్ర కల్పనలో బాపు రమణులు
చిత్ర సీమలో అపురూప మణులు
బాపు గీతలో..రమణ రాతలో మునులు..!
– జి.సూర్యనారాయణ, 6281725659.