– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ జూరాలలో ఐరన్ రోప్ లు తెగడం సాధారణం అయితే అసలు జూరాల పర్యటనకు ఎందుకు వచ్చారు ? ఆ సమస్యతో ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఆఘమేఘాల మీద మంత్రి పర్యటన ఎందుకు ? మరి వచ్చిన మంత్రి స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఐరన్ రోప్ లు తెగిన వాటిపై ఎందుకు పరిశీలన చేయలేదు?
తెలంగాణ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. కేవలం మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు నిలబెట్టారు.కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి సమూలంగా నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెప్పడం ఖాయం