శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో “నిధుల స్వాహా” పై నిగ్గు తేల్చాలి!

రాష్ట్ర ప్రభుత్వాన్ని,దేవాదాయ శాఖ, అధికార పార్టీ నాయకులను నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్

తిరుపతి ప్రజల గ్రామ దేవత పిలిస్తే పలికే సత్యమైన గంగమ్మ తల్లి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా ఓచర్లు లేకుండా ఇష్టానుసారంగా నిధులను నెలల తరబడి వాడుకుంటున్నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు,ఆడిట్ అధికారులు ఏం చేస్తున్నారన్నారు!

ఏపీలో దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఉన్నారా లేదా? నిధుల దోపిడీ పై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించి స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలన్నారు.శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భారీఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల అమ్మవారి నిధులను స్వాహా చేయగా తూ తూ మంత్రంగా శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు భక్తులలో అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

AP C.M గంగమ్మ ఆలయాన్ని సందర్శించినప్పుడు నగరపాలక సంస్థ అధికారులు ఇటీవల వేసిన రోడ్లపై మళ్ళీ రోడ్లు వేశారు అద్భుతంగా మరి దేవాదాయ శాఖ అధికారులు ఎంత ఖర్చు చేశారో భక్తులకు తెలిసేలా అధికారికంగా రిపోర్ట్ విడుదల చేయాలి.గంగమ్మ జాతరకు టీటీడీ, నగరపాలక సంస్థ,తుడా ప్రత్యక్షంగా ఆర్థిక సహకారం పరోక్షంగా అన్నీ మౌలిక సదుపాయాలు అందించడం జరిగింది మరి దేవాదాయ శాఖ జాతరకు ఎంత ఖర్చు చేశారు అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

గంగమ్మ ఆలయానికి సంబంధించిన విలువైన రికార్డులు భద్రంగా ఉన్నాయా, నగదు లావాదేవీల లెక్కతేలిందా,వెండి ఆభరణాలతో పాటు ఇతర కానుకలకు సంబంధించిన వాస్తవాలను తనిఖీ అధికారులు నిష్పక్షపాతంగా “ఇన్స్పెక్షన్ రిపోర్ట్”లో బహిర్గతం చేయాలని నవీన్ డిమాండ్ చేశారు.గంగమ్మ జాతర రోజుల్లోనే ఆలయానికి అదికంగా ఆదాయం వస్తుంది.హుండీ ఆదాయం సుమారు లక్షలలో వుంటుంది,ఇతర టికెట్లు,చందాల ద్వారా మరో 30 లక్షల రూ.ల వరకూ ఉంటుంది.అలాంటిది కొన్ని నెలలుగా “క్యాష్ బుక్” రాయకపోతే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించలేదో భక్తులకు సమాధానం చెప్పాలన్నారు.

అధికార పార్టీ పెద్దల ఒత్తిడి కారణంగా,దేవదాయశాఖ ఉన్నతాదికారులు మౌనంగా ఉన్నట్లు భక్తులలో పలు అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు. గత 20 ఏళ్లుగా ఆలయంలో వచ్చిన ఆదాయాన్ని “ఫిక్స్డ్ డిపాజిట్ల” రూపంలో కోట్లది రూ.లని బ్యాంకులో జమ చేశారు.దీని ద్వారా వచ్చే వడ్డీని మాత్రం ఆలయ నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు.జీర్ణోద్ధరణలో భాగంగా ఈ 5 కోట్ల రూ.లను విత్ డ్రా చేసి ఖర్చు పెట్టేసేరా అన్న అనుమానాలు భక్తులలో వుందన్నారు.

గంగమ్మకు ఈ ఏడాది భక్తులు భక్తితో సమర్పించిన వేలాది చీరలు నెలల తరబడి గోనె సంచుల్లో మగ్గుతున్నాయన్న భక్తుల అనుమానాలపై సమగ్ర దర్యాప్తు చేసి వాటిని వెంటనే వేలం వేసి విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. గంగమ్మ తల్లి పురాతన ఆలయాన్ని పూర్తిగా తొలగించారు,పునర్నిర్మాణం కోసం స్వచందంగా ఎంతో మంది దాతలు భక్తితో ఇచ్చిన విరాళాలపై భక్తులందరికీ తెలిసేలా శ్వేత పత్రం విడుదల చేసి భక్తులలో వున్న అపోహలను తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక అధికార పార్టీ నాయకులు చొరవ చూపాలన్నారు.

Leave a Reply