– రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి తెలియని జగన్మోహన్ రెడ్డే పోలవరానికి శాపంగా మారాడు
– ఆయన అనాలోచితచర్యలు, దుందుడుకు విధానాలే పోలవరానికి గుదిబండగా మారాయి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కి జగన్మోహన్ రెడ్డి ఒక శాపంగా, గుదిబండలా మారాడని, కొత్తగా నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి, నీటిపారుదల శాఖా మంత్రా..లేక నోటిపారుదల శాఖామంత్రో, అవగాహనలేని మంత్రో తెలియడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ….
నీటిపారుదల శాఖామంత్రి నిన్నమాట్లాడుతూ, దేశంలోనిప్రాజెక్ట్ లన్నీ డయాఫ్రమ్ వాల్ తోనే నిర్మించామనిచెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లుఉన్నాయో, ఎన్నివేలఎకరాలకు వాటిద్వారా నీరివ్చచ్చో తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డయాఫ్రమ్ వాల్ గురించి తెలియని అంబటిరాంబాబులు ప్రజలను పాలించే స్థితిలో ఉండటం.
చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం గతంలో 2022 జూన్ నాటికి పోలవరంప్రాజెక్ట్ ని పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లింది. దానికి అనుగుణంగా నే ఏకకాలంలో కాపర్ డ్యామ్, డయా ఫ్రమ్ వాల్, స్పిల్ వే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ లను సమాంతరంగా నిర్మించింది. చంద్రబాబునాయుడి హాయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులుపెట్టాయికాబట్టే, పనులు 71శాతంవరకు పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక వేగంగాసాగుతున్న పనులను ఎందుకు నిలిపివేశాడో, ఎందుకు రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడాడో రాష్ట్రప్రజలకు సమాధానంచెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక జూన్ 1-2019న పోలవరంలోజరుగుతున్న పనులన్నింటినీ ఆపేస్తున్నట్లు అన్నిదినపత్రికల్లో వార్తలువచ్చాయి. అది మొదలు నేటివరకు జగన్మోహన్ రెడ్డి పాలన పోల వరానికి శాపంగా మారింది అనడానికి అనేక ఉదాహరణలున్నాయి.
పనులు చేస్తున్న ఏజెన్సీలను రద్దుచేసి, కొత్తవాటికి పనులుకట్టబెట్టాడు. నవయుగ, బేకర్ వంటి కంపెనీలను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చాడు. జరుగుతున్న పనులకు సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లులేకుండా , జగన్మోహన్ రెడ్డి పనులుచేస్తున్నకంపెనీలను తొలగించడంవల్లే పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కింది. ముమ్మాటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోవడానికి, జరిగినపనుల్లో నష్టం జరగడానికి జగన్మోహన్ రెడ్డే కారకుడు. గోదావరినదిపైకాకుండా, నదీప్రవాహాన్ని మళ్లించేలా నిర్మించిన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించి అనుకోకుండా, గోదావరినదికి వరదలువచ్చినప్పుడు, 50లక్షలక్యూసెక్కుల నీటిని దారిమళ్లించేలా వరదనీటిని స్పిల్ వే మీదుగా తరలించే అవకాశం ఉంది.
ఆ విధంగా తరలించేలానే టీడీపీహయాంలో అధికారయంత్రాంగం సమర్థ వంతంగా పనులునిర్వహించింది. జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నకంపెనీలను సాగనంపి, ప్రాజెక్ట్ పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో, చివరకు గోదావరిలో వరద మొదలయ్యేటప్పటి కీ, అక్కడఅనుభవంలేని అధికారులు, పనులుచేస్తున్నవారులేకపోవడంతో వరదప్రవాహం తరలింపును సక్రమంగా చేయకపోవడంతో, పోలవరంప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఎప్పుడో రెండేళ్లక్రితమే 2000 సంవత్సంరంలోనే వరదధాటికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఈ ముఖ్య మంత్రి ఇన్నాళ్లపాటు ఆ రహస్యంఎందుకు దాచాడు? ప్రాజెక్ట్ నిర్వహణను జగన్ రెడ్డి గాలికొదిలేయడంవల్లే వరద ప్రభావంప్రాజెక్ట్ పై పడింది.
రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ జరిపిన జగన్ రెడ్డి అర్హతలేని, అనుభవంలేని కంపెనీలకు ప్రాజెక్ట్ పనులు అప్పగించాడు. పైపులు తయారుచేసేకంపెనీకి నిర్మాణపనులు అప్పగించి సరిదిద్దుకోలేని పొరపాటుచేశాడు.
షార్ట్ లిస్ట్, ప్రైస్ బిడ్, ఫ్రీ క్వాలిఫికేషన్, సెల్ఫ్ డిక్లరేషన్, బ్యాంకు గ్యారంటీ, లాంటి టెండరింగ్ నిబంధనలు మార్చి, తనకుకమీషన్లు ఇచ్చే అనామక కంపెనీని ప్రాజెక్ట్ పనులకోసం ముఖ్యమంత్రే తెరపైకితెచ్చాడు. కాంట్రాక్ట్ ఏజెన్సీలను మారిస్తే ప్రాజెక్ట్ భద్రత ప్రశ్నార్థకమవుతుందని పీపీఏ (పోలవరంప్రాజెక్ట్ అథారిటీ) అధికారులు చెప్పినా జగన్ రెడ్డి వినలేదు.
తన రాజకీయఅవసరాలకోసమే, తనధనదాహంకోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నార్థకంగా మార్చాడు. పోలవరంనిర్మాణంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన దుందుడుకు విధానాన్ని తప్పుపడుతూ, పోలవరంప్రాజెక్ట్ అథారిటీ వారు గతంలోనే హెచ్చరించింది వాస్తవంకాదా? పీపీఏ సీఈవో ఆర్.కే.జైన్ 16ఆగస్ట్ 2019న రాష్ట్రప్రభుత్వానికిరాసినలేఖలో పనులుచేస్తున్న ఏజెన్సీలను రద్దుచేయవద్దని కోరినా జగన్ రెడ్డి ఖాతరుచేయలేదు. 2000సంవత్సరంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి దాన్నిఎందుకుదాచిపెట్టాడో రైతాంగానికి సమాధానంచెప్పాలి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల దానిపై ఎలాంటి నిర్మాణం చేయడానికి వీలుపడదనే వాస్తవాన్ని ఇన్నాళ్లూ ఎందుకు మరుగునపరిచావు జగన్ రెడ్డీ?
ప్రాజెక్ట్ ని 2021 జూన్ లో పూర్తిచేస్తామని, 2021 డిసెంబర్లో అని, 2022 జూన్ లో అని తేదీలు ఎందుకు మార్చావు జగన్మోహన్ రెడ్డీ? డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని, దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయడానికి వీల్లేదని తెలిసి, అసెంబ్లీ సాక్షిగా ఎందుకుపచ్చి అబద్ధాలుచెప్పావు ముఖ్యమంత్రీ? రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించినందుకు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అపహస్యంగా మార్చినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలోఎన్నిప్రాజెక్ట్ లున్నాయో.. ఎన్నిలక్షలఎకరాలకు సాగునీరుఅందుతుందో ముఖ్యమంత్రికి తెలియదు.
ఎలాంటి అవగాహనలేకుండా, ప్రణాలిక, ఆలోచన లేకుండా గోదావరి జలాలను తెలంగాణ మీదుగా ఏపీకి తీసుకొస్తానన్నప్పుడే జగన్ రెడ్డి తెలివితేటలుప్రజలకు అర్థమయ్యాయి.
కేంద్రంహెచ్చరికలు బేఖాతరుచేసి, పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చి, రాష్ట్ర రైతాంగంఆశలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనంచేశాడు. జగన్ రెడ్డి కాకుండా, చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిఉంటే కచ్చితంగా 2020 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేది.రాష్ట్రప్రజల కల సాకారమయ్యేది.