కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సిఐడి తీరు మారడం లేదు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ రెడ్డి ప్రైవేటు సైన్యంగా మారిన ఏపీ సీఐడీ అర్ధరాత్రి అరాచక అరెస్టులకి మరోసారి తెగబడింది. టిడిపి మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ఇంట్లో చొరబడి మరీ సీఐడీ అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నరేంద్రని ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పలేని తప్పుడు అరెస్టులు ఇంకెన్నాళ్లు? అక్రమ అరెస్టులపై కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సిఐడి తీరు మారడం లేదు. 41 A నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా.. అక్రమ అరెస్టుకి తెగబడిన అధికారులు కోర్టు ముందు దోషులుగా నిలబడక తప్పదు. నరేంద్రకి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.