– 22వ తేదీలోపు ఆప్టికల్ గ్రౌండ్ వైర్ సమస్యలు పరిష్కరించాలి
– అధికారులకు ఫైబర్‌నెట్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య ఆదేశాలు
విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజలకు ఇక అంతరాయాలు లేని పైబర్‌నెట్ సేవలు అందించనున్నామని పైబర్‌నెట్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. పైబర్‌నెట్ సేవలు మెరుగుపరిచి ప్రజలకు అంతరాయం లేకుండా సేవలందించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన బుధవారం విశాఖపట్నంలో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలివ్వడంతో పాటు దిశానిర్దేశం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇకపై ప్రజలకు పైబర్ నెట్ సేవల్లో ఎలాంటి అంతరాయాలు ఉండటానికి వీలు లేదని స్పష్టం చేశారు. దానికనుగుణంగా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పైబర్‌నెట్ సేవల్లో డౌన్‌టైమ్ అనే మాటకే ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు లేదన్నారు. ఈ దిశగా అధికారులు లక్ష్యాల మేరకు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పైబర్ కట్‌పై నిఘా
పైబర్‌నెట్ ప్రసారాలు, సేవలకు సంబంధించి తరచూ జరుగుతున్నఅంతరాయలకు ప్రధాన కారణం పవర్ బ్యాకప్, పైబర్ కట్స్ గా గుర్తించాఉఉ. వీటిని అధికమించేందుకు పైబర్ నెట్ ముఖ్య సాంకేతికాధికారి (సీటీఓ) వీటిపైన రోజువారి నివేదికలు అందజేస్తారు. తద్వారా ఈ సమస్యలు కనిపించకుండ చర్యలు తీసుకుంటారు.
22లోపు ఓపీజీఎం సమస్యలు అధిగమించాలి
పైబర్‌నెట్ ప్రసారాల్లో అంతరాయానికి సంబంధించి మరో ప్రధాన సమస్య ఆప్టికల్ గ్రౌండ్ వైర్ (OPGW), దీనికి సంబంధించిన అన్ని సమస్యలను ఈ నెల 22వ తేదీలోపు పరిష్‌కరించి, ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలకాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని వంద శాతం సాధించడానికి అనుగుణంగా ఫీల్డ్ యూనిట్లు అప్రమత్తం చేస్తారు.
మౌలికసదుపాయాల తనిఖీ
రాష్ట్రవ్యాప్తంగా పైబర్ నెట్ కు ఉన్న మౌలికసదుపాయాలపై తనిఖీ కార్యక్రమాలు చేపట్టాలని నిర్వహించారు. దీనికోసం తనిఖీ బృందాలను సిద్ధం చేసి, ఆయా జిల్లాలో పైబర్ నెట్ కు ఉన మౌలిక సదుపాయాలు ఏంటీ, అవి ఏ స్థితిలో ఉన్నాయి తదితర వివరాలన్నీ తనిఖీ చేయాలని నిర్ణయించారు.
పైబర్ ధ్వంసంపై కఠిన చర్యలు
రాష్ట్రంలో ఎక్కడైనా సరేర పైబర్‌నెట్ వైర్లను, నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలన, ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నెట్ వర్క్ మేనేజర్లకు అధికారాలు అప్పగించారు.
జిల్లాల వారీగా అంతరాయంపై సమీక్ష
ప్రతి జిల్లాలోనూ పైబర్ నెట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం, డౌన్‌టైమ్‌కు సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయాలని నిర్ణయించారు. OLT (ఆప్టికల్ లైన్ టెర్మినల్) కు సంబంధించి డౌన్‌టైమ్ డేటాను CTO విశ్లేషించి, మెరుగైన సేవలందించే చర్యలు తీసుకుంటారు.