– విద్యుత్ సరఫరా ట్రిప్పు ను త్వరగా గుర్తించి, వెను వెంటనే మరమతులు
– విద్యుత్ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం.. రాష్ట్ర విద్యుత్ చరిత్రలో కీలక ఘట్టం
– మధిర నియోజకవర్గం జానకిపురం సబ్ స్టేషన్ లో ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మధిర: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా, అంతరాయం ఏర్పడితే వేను వెంటనే గుర్తించి మరమ్మతులు చేసేందుకు రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం (TRFMS), ఫాల్ట్ పాస్ ఏజ్ ఇండికేటర్స్ (FPI) లు ఎంతో ఉపయోగపడతాయని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం జానకిపురం సబ్ స్టేషన్ లో RTFMS, FPI వ్యవస్థలను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని NPDCL, SPDCL రెండు సంస్థల పరిధిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందో కంప్యూటర్ ద్వారా గుర్తిస్తారు, NPDCL, SPDCL కార్యాలయంలోని డాష్ బోర్డు ద్వారా కూడా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఏర్పడినా గుర్తించే అవకాశం ఈ ఆధునిక వ్యవస్థల ద్వారా వీలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం అనేది సబ్ స్టేషన్లలోని ఫీడర్ల పర్యవేక్షణ, నియంత్రణ, రక్షణ మరియు రియల్ టైం ప్రాతిపదికన సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రతి సమాచారం కంప్యూటర్ ఆధారితంగా నమోదు అవుతుందని తెలిపారు. ఈ వ్యవస్థ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా ఎక్కడైనా విద్యుత్ సరఫరా లో సమస్య ఏర్పడితే విద్యుత్ సిబ్బంది వేను వెంటనే ప్రతిస్పందించేందుకు సహకరిస్తుందని వివరించారు. మొదట రాష్ట్రంలోని 100 సబ్ స్టేషన్లలో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
మరో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫాల్ట్ పాసెజ్ ఇండికేటర్ అనేది విద్యుత్తు సరఫరా లో సమస్యను అతి త్వరగా గుర్తించడానికి, ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని గుర్తించే సమయం గననీయంగా తగ్గుతుందని తెలిపారు. విశ్వసనీయతను మెరుగుపరచడానికి, విద్యుత్ సరఫరాను అతి త్వరగా పునరుద్ధరించడంలో సహాయపడుతుందని తెలిపారు.
మొదటి దశలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన 33KV &11KV లీడర్లలో లోపాలను త్వరగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించడానికి 1000 FPI లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో NPDCL CMD వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.