Suryaa.co.in

Food & Health

జిమ్‌లో ఓవర్ ఎక్సర్‌సైజ్ వద్దబ్బా..

రోజు ఎవరైనా గంటసేపు వ్యాయామం చేస్తే సరిపోతుంది. సరే వీలైతే సాయంత్రం ఇంకో అరగంట ఎక్కువ చేసినా చాలు.
కానీ గంటలు గంటలు జిమ్ లలో గడిపే వారు పెరుగుతున్నారు.
గంటలు గంటలు జిమ్ చేయమని ఏ ఆరోగ్య సూత్రమూ చెప్పదు.
“లావుగా ఉండటం మహా పాపం, సకల రోగాలు బరువు పెరగడం వలననే!!!!!!!!”అని విపరీతంగా భయపెట్టే సరికి..
మా జిమ్ లో జాయిన్ ఐతే వారంలో తగ్గిస్తామని ఒకరంటే…
లేదు, మా డైట్ విధానం పాటిస్తే మూడురోజుల్లో తగ్గిస్తామని మరొకరు ఒకడికి ఒకడు మోపై తగలడ్డారు.
ఇంకేముంది మన జనాలు జిమ్ లకు క్యూకట్టడమే కాకుండా టిఫిను లంచ్ డిన్నరు కూడా అక్కడే చేసేసేలా తయారయ్యారు.
అఘమేఘాలమీద బరువు తగ్గి..ఎవరినో ఇంప్రెస్ చేసేయాలని లేదా సిక్స్ పాక్ వచ్చేలా కండలు కరిగించాలని..కండలు పెంచేయాలని..రకరకాల వంకర్లు తిరిగిన అసంబద్ద రూపాలతో ఇంకెవరికో కనుల విందు చేయాలనీ చిందులు తొక్కడం మొదలైంది. Weight reduction అవసరమే. కానీ దానికో పద్దతి ఉంది.


శరీర ధర్మశాస్త్రం (physiology)అనేదొకటి ఉంటుంది కదండీ..దాని లెక్క వేరే గా ఉంటుంది. ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది..వారి వారి శరీర తత్వాలను జన్యువులనూ అనుసరించి. కానీ అదంతా జాన్తానై. పలానా వాడిలా సన్నగైయ్యాడు నేనూ ఐపోవాలి. ఇంకేముంది హెల్త్ డ్రింకులు మిల్కు షేకులు డైట్ ప్లానులు అనబాలిక్ స్టిరాయిడ్సూ..ఒక్కటేంటి అన్నీ..Im a fitness freak you know అని బిల్డప్పులు మళ్ళీ.
ఒక్క నెలలో తగ్గిపోవాలనో..పదిరోజుల్లో తగ్గాలనో శరీరాన్ని తీవ్రమైన వ్యాయామాలతో హింసించి హింసించి సాధించేది ఏమీ ఉండదు. ఎవరి శరీరాన్ని వారు అర్థం చేసుకుని ఒక క్రమబద్ధమైన జీవన పద్ధతులు కలిగి ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉంటు నియమిత పద్దతిలో వ్యాయామం నియమిత పౌష్టికాహారం తీసుకుంటూ నింపాదిగా ఏ టెన్షన్లు లేకుండా ఉంటే శరీరం ఉండాల్సినంత అందంగానే ఉంటుంది. అందమంటే సన్నగా ఉండటం మాత్రమే అని కాక ఆరోగ్యం అంటే కూడా సన్నగా పీలగా లోతు కళ్ళతో..పీక్కుపోయిన చెంపలతో..కండలేని పెదవులతో ఉండటం అనుకునే సన్నాసి శకం మొదలైంది..
అంతా యూట్యూబ్ మహిమ. తెగ ఓవర్ ఇన్ఫర్మేషన్ తో తెగ ఇబ్బందులు తెచ్చేసుకుంటున్నారబ్బా…

LEAVE A RESPONSE