Home » బాహుబలి కాదు.. బతుకు లోగిలి!

బాహుబలి కాదు.. బతుకు లోగిలి!

ఇది బాహుబలి దృశ్యం కాదు… బతుకు చిత్రం . ఎడతెరపి లేని వర్షాల కారణంగా విశాఖ మన్యంలో రహదారులు వంతెనలు లేక, గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ప్రతిబింబం . ఆ పసిబిడ్డకు నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరం. ఎడతెరిపిలేని వర్షాలు ఉధృతంగా పారుతున్న వాగు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ పసిబిడ్డకు ఏమవుతుందో అని ఆ తండ్రి చేసిన సాహసం. బిడ్డను చేతులతో పైకెత్తి తల మీద పెట్టుకుని, పీకల్లోతుల్లో వాగులో దిగి అవతలి ఒడ్డుకు చేరి, లోతుగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి బిడ్డను తీసుకుని వెళ్లాడు. ఆ నాన్నకు జేజేలు.ఆ పాపకు ఆశీస్సులు.సారు.. ఓ పాలి ఆ గిరిజన గ్రామాల వైపు చూడండి అని ..పాలక ప్రభువులకు వేడుకోళ్లు విన్నపాలు. తమ ప్రాణాలు పణంగా పెట్టి.. తమ కనురెప్పలను కాపాడుకునేందుకు సాహసించిన ఇలాంటి బాహుబలులైన తండ్రులకు జోహార్లు. ఇది ఏపీలోని గిరిజన ప్రాంతాల విషాదానికి .. కనీస సౌకర్యం కల్పించలేని పాలకుల అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం. కాదంటారా? కాదనే వారికి ఈ ఫొటోనే సాక్ష్యం!

Leave a Reply