మతం కాదు.. అభిమతం ముఖ్యం

జపాన్ ను చూసి.. చిద్రమైన దేశం సైతం నిరంతర శ్రమ తో గొప్ప మేధస్సు తో ప్రపంచానికి ఆదర్శంగా మారడం నేర్చుకోవచ్చు.
ఆఫ్గన్ ను చూసి.. మూర్ఖత్వం తో సర్వస్వం కోల్పోతూ ఎడారి గా మారుతున్న కిరాతక రాజ్యం చూడవచ్చు..
దుబాయ్ ను చూసి ఎడారి నే ప్రపంచానికి ఒక మంచి ఉపాధి ,పర్యాటక స్థలం గా మార్చిన నాయకత్వం చూడవచ్చు .
అక్కడ ప్రపంచం లో ఉన్న అన్ని మతాల వారు పని చేస్తున్నారు. దేశం మతం తో సంబంధం లేకుండా అందరికీ సమాన గౌరవం ఉంది. ఆదేశ అస్తిత్వంతో పాటు ప్రజలకు శాశ్వత ఆరక్షణ కల్పించే రాజ్యాంగం.

ఇజ్రాయెల్.. అక్కడ ఒక్క చుక్క మంచినీరు దొరకదు . పూర్తి చౌడు భూములు, చుట్టూ శతృ దేశాలు..ఈనాటి ప్రపంచం లో అధిక సంఖ్యలో ఉన్న క్రిస్టియన్,ముస్లిం మతాలు పుట్టిన ఇల్లు.. కానీ అక్కడ స్థానిక మతం యూధులు ఆజన్మాంతం ఆరెండు మతాల వారికి బద్ధ శత్రువులే . అక్కడ లిటరసీ 100 శాతం. ప్రపంచం లో అతిగొప్ప మేధావులు, ప్రపంచాన్ని శాసించే వ్యాపారులు ఇక్కడి వారే. ఆధునిక వ్యవసాయం ( భూమి లేకుండా వ్యవసాయం), సముద్రపు నీటిని మంచినీరు గా మార్చడం.. రక్షణ పరికరాలు technology లో వీరు ఈ నాటికీ అందరికంటే ముందంజ లో ఉన్నారు.

భారత్ లో మాత్రం నాయకులు కొన్ని సంవత్సరాలు గా దేశ భవితవ్యాన్ని పణంగా పెట్టి ప్రజలమధ్య వర్గ, మత చాందస విబేధాలు ఉసికొలుపుతూ, తిరోగమనానికి నాంది పలకడం గమనిస్తున్నాం . ఈ దేశాల అన్నింటిలోనూ ప్రజలు – నాయకుల మతం కాదు. అభిమతం మాత్రమే ముఖ్య పాత్ర కదా?!

-లంకా, నర్సరావుపేట

Leave a Reply