Suryaa.co.in

Andhra Pradesh

గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచాలి

– వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయటంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ గరిష్ట వయోపరిమితిని 44ఏళ్లకు పొడిగించాలని డిమాండ్
– తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకు లోకేష్ హితవు
– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ

2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమవుతూ రావటం దురదృష్టకరం.నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు.గుడ్డిగా అసత్య వాగ్ధానాలు నమ్మి విశ్వసించిన యువత ఆశలపై అధికారంలోకి వచ్చాక కోలుకోలేని దెబ్బకొట్టారు.గత నాలుగన్నరేళ్లుగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ లేక మోసపోయిన యువత ఎన్నో బాధలు అనుభవించారు.

నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసింది.ఎన్నికలు దగ్గరపడుతున్నందున అకస్మాత్తుగా నిద్ర మేల్కొని గ్రూప్ నోటిఫికేషన్ల పేరుతో మరో వంచనకు సిద్ధమయ్యారు.ఎన్నికల కోసం జారీ చేసిన తాజా గ్రూప్1, గ్రూప్2 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎంతో మంది నిరుద్యోగ యువత అశలపై నీళ్లుచల్లుతోంది. నోటిఫికేషన్‌ల దరఖాస్తుకు ఎంతో మంది నిరుద్యోగ యువత అనర్హులవుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వయో పరిమితి నిబంధన కారణంగా దరఖాస్తు చేసుకోలేని యువతకు సడలింపు ఇవ్వాలి.తెలంగాణ రాష్ట్రం తరహాలో గరిష్ట వయోపరిమితిని కనీసం 44 సంవత్సరాలకు పెంచాలి. రాష్ట్ర యువతకు మీరు చేసిన మోసానికి పరిహారంగా అయినా వయోపరిమితి పెంచాలి.

LEAVE A RESPONSE