Suryaa.co.in

Andhra Pradesh

ఇప్పుడు పత్రికలు, విద్య, వైద్యం కమిషన్ కోసం నడుస్తున్నట్లుగా ఉంది

– పరిపాలన తెలుగులో ఉండాలి
– భాష హుందాతనంగా ఉండాలి. దుర్భాషలు వద్దు
– గుంటూరు రింగ్ రోడ్డు లోని సిద్ధార్థ గార్డెన్స్ నందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం
– హాజరైన మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
– వెంకయ్యనాయుడుని కలిసిన వివిధ రంగాల ప్రముఖులు, నగర ప్రముఖులు

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఏమన్నారంటే… గతంలో పత్రికలు, విద్య, వైద్యం ఓ మిషన్ కోసం నడిచేవి, ఇప్పుడు కమిషన్ కోసం నడుస్తున్నట్లుగా ఉంది. రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటే నాకిష్టం. ఉప రాష్ట్రపతిగా ఉన్నా చాలా ఆంక్షలు పక్కన పెట్టి దేశం మొత్తం తిరిగాను. పదవి నుంచి దిగాక గతంలో మాదిరిగా నేను నాకిష్టమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది.

రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరి పైనా ఉంది. చట్ట సభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదు. శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పరిధులు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. చట్ట సభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలి.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఏం జరిగుతుందని ప్రపంచమఅంతా చూస్తుంది.చట్ట సభల్లో మాట్లాడే భాష సభ్యత, సంస్కారంతో ఉండాలి. భాష హుందాతనంగా ఉండాలి. దుర్భాషలు వద్దు . రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా ప్రధాని మార్చారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరించారు. స్వతంత్రంకోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ప్రముఖులే.. గాంధీ ముందుండి నడిపినా మిగతా వారి పాత్ర తక్కువ కాదు. చాలామంది పోరాట యోధుల కు దక్కాల్సిన గుర్తింపు రాలేదు.

మాతృభాష ప్రాధాన్యం ఇవ్వాలి, మన భాషను మనం గౌరవించుకోవాలి.ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలో మాట్లాడుకోవాలి. పరిపాలన తెలుగులో ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరూ చెప్పరు,image-1 ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉన్నత స్థాయికి వస్తారనే అభిప్రాయం తప్పు.మాతృభాషలో చదివిన చాలా మంది దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారు. ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణ నేను ఊర్లలో మాతృభాషలో చదువుకున్న వాళ్ళమే. మాతృభాషలో చదవాలి, ఇంగ్లీషు, హిందీతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలి.

నా జీవితంలో స్నేహ సంపద, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం వల్లే ఈ స్థాయికి వచ్చాను. కుటుంబ వ్యవస్థ, సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ నన్ను నిలబెట్టాయి. ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, గోరంట్ల పున్నయ్య చౌదరి, జమ్ముల శ్యామ్ కిషోర్, డాక్టర్ మాదాల శ్రీనివాస్, ఆర్ లక్ష్మీపతి, మాదాల రాజేంద్ర, వల్లూరు జయప్రకాష్ నారాయణ, జూపూడి రంగరాజు మరియు వివిధ రంగాల ప్రముఖులు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE