Suryaa.co.in

Andhra Pradesh

మహిళా కార్యకర్తలు టీడీపీలో ఎప్పటికీ మహారాణులే

-నారా బ్రాహ్మణికి పూలవర్షంతో పూర్వ స్వాగతం
-దుగ్గిరాల స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశం

దుగ్గిరాల, మహానాడు: డ్వాక్రా పేరు చెబితే చంద్రబాబు ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే నారా లోకోష్‌ అలా గుర్తుకు వస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో జంపాల కల్యాణ మండపంలో స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో ఆమె సమావేశమయ్యారు. ఆమెకు డ్వాక్రా మహిళలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. మిమ్మల్ని చూస్తుంటే అన్న ఎన్టీఆర్‌ మళ్లీ వచ్చారా అన్నట్టు ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రాణించి సత్తా చాటగలదని గుర్తించిన అన్న ఎన్టీఆర్‌ మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలిచ్చారు. ఆస్తిలో సమానహక్కు ఇచ్చారు. మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ సంక్షేమానికి కొనసాగింపుగా మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు డ్వాక్రాకు శ్రీకారం చుట్టి వారి స్థితిగతులను మార్చేశారు. డబ్బు కోసం భర్త వైపు చూసే స్థాయి నుంచి అంతర్జాతీయ యువనికపై ప్రసంగాలు ఇచ్చే స్థాయిలో మహిళలను సగర్వంగా నిలబెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఐదేళ్లుగా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరలు, నాశిరకం మద్యం, డ్రగ్స్‌ వంటి వాటితో కుటుంబాలు విచ్చిన్నమయ్యాయన్నారు.

ఇతర నియోజకవర్గాల్లోనూ స్త్రీ శక్తి పథకం
19 ఏళ్ల వయసుకే వివాహమైన నేను ఉన్నత చదువులు చదువుకునేందుకు నారా లోకేష్‌ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేను. అదే ప్రోత్సాహాన్ని స్త్రీ శక్తి సహా 29 పథకాల ద్వారా మంగళగిరి ఆడబిడ్డలకు లోకేష్‌ అందిస్తున్నా రు. స్త్రీ శక్తి ద్వారా టైలరింగ్‌ నేర్చుకుని ఆర్థిక ఉపాధి పొందుతున్న మహిళలను చూస్తుంటే నాకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి పొందామని తద్వారా కుటుంబానికి ఆర్థికంగా తమవంతు సాయం అందిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ విజయానికి తమ వంతు ప్రచారం చేయాలని విదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చామని పలువురు ఎన్‌ ఆర్‌ఐలు చెప్పారు.

పసుపు రైతులతో ముఖాముఖి
దుగ్గిరాలలో పసుపు మిల్లును నారా బ్రాహ్మణి పరిశీలించారు. పసుపు కొమ్ముల నుంచి పసుపును ఎలా తయారు చేస్తారో అక్కడి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. లోకేష్‌ను ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తారని హామీ ఇచ్చారు. అనంతరం దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడులో దశాబ్దాల చరిత్ర కలిగిన చదలవాడ అన్నపూర్ణమ్మ జిలేజీ షాపును బ్రాహ్మణి సందర్శించారు. వారు తయారుచేసిన జిలేబీ, ఇడ్లీ రుచి చూశారు.

LEAVE A RESPONSE