Suryaa.co.in

Andhra Pradesh International

ఎన్నారై టీడీపీ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలి

-మాతృభూమి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో NRI TDP సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలి
– వై.వి.బి. రాజేంద్రప్రసాద్

అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో, ఫిలీ సిటీలో ఎన్నారై టిడిపి నాయకులు, తానా మహాసభలు -2023 కు కన్వీనర్ అయిన రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సభకు ముఖ్య అతిధి గా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, అభివృద్ధి కనుమరుగైపోయిందని, మరల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందనిnri-tdp1 రాజేంద్రప్రసాద్ అన్నారు. కనుక జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం, మాతృభూమి అభివృద్ధి కోసం ప్రతి ఒక్క ఎన్నారై టిడిపి సభ్యుడు నడుం బిగించి, రాబోయే ఎన్నికలలో క్రియాశీలకంగా పని చేయాలని అందుకోసం ఎన్నారై టిడిపి సభ్యులు ఎన్నికల ముందు ఒక నెల రోజులు ఇండియా వచ్చి తమ తమ గ్రామాలను దత్తత తీసుకొని తెలుగుదేశం పార్టీ విజయం కోసం అంకితభావంతో కృషి చేయాలని రాజేంద్రప్రసాద్ ఎన్నారై టిడిపి సభ్యులకు పిలుపునిచ్చారు.

రవి పొట్లూరి మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం, తెలుగు నేల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబుని మరలా ముఖ్యమంత్రిగా చేసేంతవరకు ఎన్నారై టిడిపి సభ్యులం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, రాజీలేని కృషి చేస్తామని, రాబోయే ఎన్నికలలో మా ఎన్నారై టిడిపి సభ్యులు మా గ్రామాలకు వచ్చి తెలుగుదేశం విజయం కోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో కష్టపడి పని చేస్తామని రవి పొట్లూరి పేర్కొన్నారు.

నాట్స్ కన్వీనర్ అప్పసాని శ్రీధర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం కోసం, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, ఎన్నారై టిడిపి నాయకులముగా ఎన్ని త్యాగాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని శ్రీధర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ని ఎన్నారై టిడిపి నాయకులు సత్కరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి నాయకులు నాట్స్ కన్వినర్ అప్ప సాని శ్రీధర్ , మందలపు రవి , కోగంటి విశ్వనాథ్, రావుల శ్రీనాధ్ తదితరులు పాల్గొని ప్రసంగించినారు.

LEAVE A RESPONSE