Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీవీ,టీవీ9లకు..అన్న చెప్పమన్నారట!

– దిద్దుబాటులో ఆ రెండు టీవీలు
– సీఎం చంద్రబాబు, హోంమంత్రి ప్రెస్‌మీట్ సుదీర్ఘ టెలికాస్ట్
– అన్నా ఆ విజువల్స్ రాకుండా చూడండి!
– మధ్యలో జగన్నాధరథ చ క్రాలవీడియో చూపించవద్దని చానెల్ యజమానులకు ఫోన్లు?
– ‘అన్న‘ చెప్పమన్నారని సజ్జల చెప్పారట
– అధికారం కోల్పోయినా మీడియా మేనేజ్‌మెంట్‌లో ముందున్న వైసీపీ

(రైతు బిడ్డ)

అదేదో సామెత చెప్పినట్లు ఉంది ఎన్టీవీ,టీవీ9 చానెళ్ల పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఈ రెండు మీడియా ఛానెళ్ల తీరు తెలిసి మొదటి నుంచీ దూరం పెడుతోంది. తాము న్యూట్రల్స్ అని చెప్పుకునేందుకు వీళ్లు ఏడాది కాలంలో అనేక ప్రయత్నాలు చేశారు. అయితే వీరి సంగతి తెలిసిన ప్రభుత్వం…వీరిని దగ్గరకు రానివ్వడం లేదు.

ఇక తాజా విషయానికి వస్తే….వైఎస్ జగన్ కారు ఎపిసోడ్ లో బయటపడిన వీడియో సంచలనం సృష్టించింది. అన్ని మీడియా ఛానల్స్…అన్ని ఏజెన్సీలు దీన్ని ప్రముఖంగా చూపించాయి. కొన్ని ఇంగ్లీష్ ఛానళ్లు కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. అయితే ఇంత జరుగుతున్నా…..ఎపిలో ఉన్న ఎన్టీవీ,టీవీ9 మాత్రం ఆ విజువల్‌ను ప్రసారం చెయ్యలేదు.

దీన్ని గమనించిన సోషల్ మీడియా, మీడియా వర్గాలు ఈ అంశాన్ని చర్చలో పెట్టాయి. బయట మార్కెట్ లో ఇమేజ్ పోతుంది అని భావించిన ఈ రెండు ఛానల్స్ , దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాయి. నిన్న సాయంత్రం హోంమంత్రి ప్రెస్ మీట్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి లైవ్ తీసుకున్నారు. అలాగే సీఎం పాల్గొన్న సాయంత్రం సభ మొత్తం లైవ్ ఇచ్చారు.

ఈ విషయం తెలిసిన సజ్జల ఈ రెండు ఛానల్స్ కు ఫోన్ చేశాడట. వాళ్ల లైవ్ ఇస్తే ఇచ్చారు. జగన్ కారు కింద కార్యకర్త పడిన వీడియో మాత్రం ఏ సందర్భంలోనూ టెలికాస్ట్ చెయ్యవద్దు అని చెప్పారట. మంత్రుల ప్రెస్ మీట్లు తీసుకోవద్దని…ఒక వేళ తీసుకున్నా ఎక్కడా కారు అంశం కానీ, కారు విజువల్స్ కాని రాకుండా చూడాలని ప్రత్యేకంగా చెప్పారట.

స్వయంగా రెండు ఛానల్స్ పెద్దలకు ఫోన్ చేసిన సజ్జల…అన్న చెప్పమన్నారు…ఈ వీడియో ఎన్టీవీ,టీవీ9 లతో పాటు 10 టివిలో కూడా రాకుండా చూడాలని చాలా గట్టిగా చెప్పారని చెప్పారట. దీంతో ఈ ఎపిసోడ్‌లో ఏం చెయ్యాలో తెలీక ఆ రెండు చానెల్స్ తలలు పట్టుకున్నాట.

ఇప్పటి వరకు ఆ విజువల్స్ తమ ఛానల్ స్కీన్ మీద రాకుండా చూశామని…ఇక ఎక్కువ కాలం ఆ వార్తను రాకుండా ఆపితే ,తమ ఇమేజ్ మొత్తం పోతుందని వాళ్లు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. ఏది ఏమైనా మీడియా మేనేజ్మెంట్‌లో….పదవిపోయిన తరువాత కూడా వైసీపీ పట్టుకోల్పోలేదు అనిపిస్తుంది.

LEAVE A RESPONSE