– జెట్ స్పీడ్ లో పరుగులు
– మూడు షిప్టుల్లో పని
– రెండు, మూడేళ్లలో విజుబుల్ డెవలప్‌మెంట్
అమరావతి నిర్మాణం ఊపందుకుంది. అక్కడ మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం పది వేల మంది అమరావతి నిర్మాణ పనుల్లో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి గతంలో నిలిచిపోయిన పనులు .. మళ్లీ టెండర్లు వేసి పనులు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత కాంట్రాక్టర్ సంస్థల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రభుత్వ నిర్మాణాలతోపాటు ప్రైవేటు కంపెనీలు కూడా వాటికి కేటాయించిన స్థలాల్లో ప్రారంభిస్తున్నాయి. స్థలాలు పొందిన ప్రతి ఒక్కరికీ .. నిర్మాణాలు ప్రారంభం ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ లోపు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకపోతే స్థలాలను రద్దు చేశారు. గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ బత్తి కంపెనీలు.. చాలా కంపెనీలు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయి. ప్రారంభించకపోతే ఆ కేటాయింపులను రద్దు చేస్తారు.
రెండు, మూడేళ్లలో విజుబుల్ డెవలప్‌మెంట్ ను అమరావతిలో ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అమరావతి విస్తరణ ప్రణాళికను కూడా అమలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుతో పాటు వివిధ సంస్థలకు అవసరమైన భూమిని.. భూమీకరణలో సేకరించేందుకు నిర్ణయించారు. చాలా మందిరైతులు తమ ఆమోదం తెలిచేస్తున్నారు. ప్రసూత పనులు జోరుగా సాగితే.. వారికి మరింత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది.