ఆలస్యంగా వచ్చినా పివికి భారతరత్న రావడం సంతోషం

– పివి మనుమడు , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్

దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం దక్కింది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికే గర్వకారణమైన పివి నర్సింహారావుకు బిజెపి ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల , పివి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లి తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప రాజనీతిజ్ఞుడు అని పి వి నరసింహారావు మనుమడు , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. పివి దేశానికి చేసిన సేవలను కాంగ్రెసు పార్టీ గుర్తించ లేదని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి రాజకీయలకు అతీతంగా …కళాకారులకు శాస్త్రవేత్తలకు అనేక రంగాల్లో సేవలు అందించేందుకు, ప్రముఖులను గుర్తించి పురస్కారాలు అందజేశారని అయన తెలిపారు. ఆలస్యంగా వచ్చినా పివి కి భారత రత్న రావడం సంతోషంగా ఉంది.

Leave a Reply