Suryaa.co.in

Andhra Pradesh

ఓషన్ క్వీన్ గోలి శ్యామల

– 150 కిలోమీటర్ల మేర సముద్రంలో స్విమ్మింగ్ ఎక్పడేషన్
– ఆరు రోజుల పాటు సాహస యాత్ర
– కాకినాడ సీపోర్టు ఆధ్వర్యంలో ఘనస్వాగతం

విశాఖ: సముద్రాలలో ఎన్నో సాహన యాత్రలను చేసిన ఓషన్ క్వీన్ గోలి శ్యామల విశాఖ నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల మేర సముద్రంలో స్విమ్మింగ్ ఎక్పడేషన్ చేసారు. ఈనెల 29వ తేదీన ప్రారంభమైన సాహస యాత్ర ఆరు రోజుల పాటు సాగింది.

ఐదు పదుల వయస్సు లో స్వీమ్మింగ్ మీద ఉన్న మక్కువతో ఆమె సముద్రంలో స్విమ్మింగ్ చేసి.. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారని తేలియజేసేందుకు ఈ సాహస యాత్రను చేపట్టారు. కాకినాడకు చేరుకున్న శ్యామలకు కాకినాడ సీపోర్టు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.

శ్యామలకు స్వాగతం పలికిన వారిలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ నగరపాలకసంస్థ కమీషనర్ భావన, సీ పోర్ట్సు సి.ఇ.ఒ. మెర్ల మురళీధర్, కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ లు పెద్దిరెడ్డి సతీష్, ఇరుసుమల్ల రాజు, ముఖ్య సలహాదారుడు మంగా వెంకట శివరామకృష్ణలు ఉన్నారు.

LEAVE A RESPONSE