– కాలువ కోసం భూమిని తీసుకున్న ప్రభుత్వం
నారాయణపేట: నర్వ మండలం లంకాల గ్రామానికి చెందిన రైతులు అయ్యపోల్ల వెంకటేశ్వర్ రెడ్డి, చిన్న కిష్టయ్య, వీరన్న గౌడ్, నల్ల హనుమంతుకు చెందిన 1 ఎకరం 36 గుంటలు సంగం బండ కాలువ భూసేకరణలో పోయింది. ఇందుకుగాను నష్టపరిహారం కింద సుమారు రూ.28 లక్షలకు సంబంధించి డాక్యుమెంటేషన్ అంతా పూర్తై చెక్ రెడీ అయ్యే దశలో ఉంది.
అయితే కలెక్టరేట్లో భూసేకరణ కార్యాలయంలో పని చేసే రవీందర్ రెడ్డి వచ్చిన దాంట్లో తనకు రూ.8 లక్షలు ఇస్తే గాని చెక్ ఇవ్వనంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.