– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి : తుపాను నేపథ్యంలో మండల అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని మండల కార్యాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కురిచేడు దర్శి అధికారులతో సమావేశమయ్యారు. ఆయా మండల కార్యాలయాలలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఆయా గ్రామాల్లోని పరిస్థితులు పునరావాసం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు.
రెవెన్యూ మండల సిబ్బంది, పంచాయతీ రాజ్, పోలీస్, గ్రామ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు సమిష్టిగా తుపాను తాకిడి నుండి ప్రజలను కాపాడాలని కోరారు. ప్రభుత్వ సూచనలు కనుగుణంగా జిల్లా అధికారుల తో సమన్వయం చేసుకుంటూ ఉండాలని, ఆయా గ్రామాలలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులు పొంగుపల్లె ప్రాంతాల్లో ప్రజలు ఆ వైపు వెళ్లకుండా, ప్రమాదాలు జరగకుండా అధికారులు సూచనలు చేయాలని కోరారు. సమీక్షా సమావేశంలో దర్శి మండలం తుపాను స్ఫెషల్ ఆఫీసర్ ఎ.గాయత్రి, ఎమ్మార్వో శ్రవణ్ కుమార్, ఎస్ఐ మురళీ, ఎంపీడీవో కె.కల్పన, మున్సిపల్ కమిషనర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.