Suryaa.co.in

National

అయ్యో రామా.. హతవిధీ

అక్రమ నిర్మాణం కుప్పకూలింది

– ఏడుగురు విగత జీవులయ్యారు

(బహదూర్)

భద్రాచలంలో ఘోరం. నిర్మాణంలోని ఆరు అంతస్థుల భవనం కుప్ప కూలిపోగా.. ఏడుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన బుధవారం మద్యాహ్నం జరిగింది. టూ ప్లస్ వన్ భవనం నిర్మాణానికి అనుమతి తీసుకుని.. ఫైవ్ ప్లస్ వన్ తో అపార్ట్మెంట్ను నిర్మిస్తుండగా.. ఈ విషాదం జరిగింది. రియల్ ఎస్టేట్ పాపం పండింది. కానీ ఏడుగురు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల ఆధారం కూలిపోయింది. ఈ భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కొత్తగూడెం పట్టణ అభివృద్ధి సంస్థ.. భద్రాచలం మున్సిపాలిటీ.. అధికారులందరూ దోషులే. కుడా వైస్ చైర్మన్, బీఎంసీ కమిషనర్.. టౌన్ ప్లానర్.. బిల్డింగ్ ఇన్స్ పెక్టర్ సహా అందరూ జైలుకు వెళ్లేందుకు అర్హులే. చూద్దాం పాలకులు ఏంచేస్తారో? మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి.. అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారో? లేక నిజాన్ని నిజాయితీగా నిరూపిస్తారో.. చూద్దాం.

LEAVE A RESPONSE