Suryaa.co.in

Editorial

ఒక కొణిదెల అన్నా.. ఒక వైఎస్ జగన్.. ఒక తిరుమల డిక్లరేషన్

  • క్రైస్తవురాలయిన పవన్ భార్య టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చిన వైనం

  • తనకు హిందూ ధర్మంపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్

  • కొండపైకి వెళ్లి గుండుకొట్టించుకున్న అన్నా కొణిదెల

  • స్వయంగా భక్తులకు భోజనం వడ్డించిన పవన్ భార్య

  • భక్తులతో కలసి సహపంక్తిభోజనం

  • అన్నదాన పథకానికి 17 లక్షల విరాళం

  • నీరాజనం పట్టిన హిందూ సమాజం

  • తన మనుమడి ప్రతి పుట్టినరోజున అన్నదానికి బాబు భారీ విరాళం

  • ఇంతవరకూ నయాపైసా విరాళం ఇవ్వని జగన్

  • ఇప్పటిదాకా టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వని జగన్

  • డిక్లరేషన్ ఇవ్వకుండానే దైవదర్శనం

  • జగన్ క్రైస్తవుడని తెలిసినా డిక్లరేషన్ అడగని ధర్మారెడ్డి

  • అడ్డు చెప్పని భూమన, వైవి సుబ్బారెడ్డి

  • ఒక్కసారి కూడా తిరుమలకు రాని జగన్ భార్య భారతీరెడ్డి

  • ఇంట్లోనే సర్కారు సొమ్ముతో సెట్ వేసుకున్న వైచిత్రి

  • అన్నా పవన్ క్రైస్తవురాలయినా స్వచ్ఛంద డిక్లరేషన్

  • రష్యన్‌ను చూసి హిందూ ధర్మం నేర్చుకోమంటూ వ్యాఖ్యలు

  • అన్నానే అసలైన క్రైస్తవురాలంటూ సోషల్‌మీడియాలో పోస్టులు

  • అన్నా-జగన్‌ను పోల్చుతూ జగన్‌పై విరుచుకుపడుతున్న హైందవ సమాజం

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆమె పేరు కొణిదెల అన్నా. స్వతహాగా రష్యన్ దేశస్తురాలు. అంతకుమించి క్రైస్తవురాలు. దానికితోడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య. సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తనకు కొడుకును రక్షించినందుకు కృతజ్ఞతగా ఆమె తిరుమల వెళ్లారు. తాను క్రైస్తవురాలు, పైగా పవన్ భార్య అయినందున.. మాజీ సీఎం జగన్ మాదిరిగా, డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకోలేదు. స్వయంగా ఆమెనే టీటీడీ అధికారులను అడిగి డిక్లరేషన్ బుక్ తెప్పించి.. తనకు హిందూ మత విశ్వాసాలపై అపారమైన విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారు. అంతేనా? తన మొక్కు తీర్చుకునేందుకు ప్రేమతో పెంచుకున్న జుట్టు తీయించుకున్నారు. అక్కడి నుంచి అన్నదాన సత్రానికి వెళ్లి, భక్తులకు వడ్డిండి, తాను కూడా వారితో సహపంక్తి భోజనం చేశారు. అన్నదాన పథకానికి 17 లక్షల విరాళం ఇచ్చారు.
– ఇదీ తిరుమల కొండపై కోట్లాదిమంది భక్తులు దర్శించిన ఒక అసాధారణ దృశ్యం. చాలామంది అన్యమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం చేసినా, ఎవరూ గుండు కొట్టించుకోరు. కానీ.. పవన్ భార్య అన్నా అందుకు భిన్నంగా తలనీలాలర్పించి, తన భర్త చెప్పే సనాతన ధర్మాన్ని గౌరవించారు.

సీన్ కట్ చేస్తే.. క్రైస్తవుడైన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చాలాసార్లు తిరుమలకు వెళ్లారు. కానీ ఒక్కసారి కూడా తనకు హిందూ మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. పైగా ఎందుకు ఇవ్వాలని ఎదురుదాడి చేశారు. అప్పట్లో జెఈఓగా ఉన్న ధర్మారెడ్డిగానీ, చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డిగానీ ఆయనతో సంతకం చేయించే ధైర్యం చేయలేదు. జగన్ మతం మారిన క్రైస్తవుడన్న విషయం బహిరంగమే. ఆయన కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలు క్రైస్తవ ఆచారాల మేరకే జరుగుతాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంత్యక్రియలు కూడా పూర్తిగా క్రైస్తవ పద్ధతులోనే జరిగిన విషయం తెలిసిందే. అయినా అప్పటి టీటీడీ అధికారులు, చైర్మన్లు జగన్ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడక్కుండా, సన్మానం చేసి పంపించిన అధర్మం అందరికీ తెలిసిందే.

కాగా ముఖ్యమంత్రులుగా చేసిన చంద్రబాబునాయుడు సహా చాలామంది సీఎంలు.. తమ భార్య, కుటుంబసభ్యులతో వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన దృశ్యాలు భక్తకోటి చూసినవే. సకటుంబ సపరివార సమేతంగా వచ్చే సీఎంల కుటుంబాలు, దైవ సన్నిథిలో చాలాసేపు గడుపుతుంటాయి.

కానీ జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకూ, వెంట తన భార్య భారతీరెడ్డిని ఒక్కసారి కూడా తీసుకురాలేపోయారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సమయాల్లో కూడా భారతీరెడ్డి లేకపోవటంతో, ఆమె క్రైస్తవురాలు కాబట్టి హిందూ ధ ర్మంపై నమ్మకలం లేదన్న అభిప్రాయం హిందూ సమాజంలో బలపడింది. అయినా దానిని దిద్దుబాటుకు దిగేందుకు ఇష్టపడలేదు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా.. నిఖార్సయిన క్రైస్తవురాలయినప్పటికీ, హిందూ మత విశ్వాసాలు గౌరవించడమే కాకుండా, తలనీలాలు ఇవ్వడం అసాధారణ అంశం. పవన్ కల్యాణ్ భార్య అన్నా రష్యన్ దేశస్తురాలు. రోజువారీ దైనందిక కార్యక్రమాల్లో ఆమె క్రైస్తవాన్ని అనుసరిస్తున్నప్పటికీ, తిరుమలకు వెళ్లి గుండు చేయించుకున్న తీరును హిందూ సమాజం స్వాగతించడమే కాదు. నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది. సింగపూర్‌లో చదువుకుంటున్న తన కొడుకు ప్రాణహాని లేకుండా సురక్షితంగా బయటపడినందుకు, ఆమె తన మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు అన్నా అంశంలో.. జగనన్న పరిస్థితి ఇరకాటంలో పడింది. అసలు సిసలు క్రైస్తవురాలయిన అన్నా పవనే డిక్లరేషన్ ఇచ్చి, తలనీలాలు సమర్పిస్తే.. మతం మారిన ‘కొసరు క్రైస్తవుడయిన’ జగన్ ఎందుకు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు? తన భార్య భారతీరెడ్డిని తిరుమలకు ఎందుకు తీసుకురారు? అంటే మీకు హిందూధర్మంపై విశ్వాసం లేదా? అంటూ హిందువులు, సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇక పవన్ భార్య అన్నా.. నిత్యాన్నదాన పథకానికి 17 లక్షల విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు తన మనుమడు దేవాన్ష్ పుట్టిన తర్వాత, ప్రతి ఏడాది మనుమడి పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లి, అన్నదాన పథకానికి భారీ విరాళం ఇచ్చే సంప్రదాయం తెలిసిందే.

కానీ ఐదేళ్లు సీఎం, అంతకుముందు ఎంపి-ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త కూడా అయిన జగన్.. ఇప్పటివరకూ ఎర్రయాగాణి కూడా టీటీడీకి విరాళంగా ఇవ్వకపోవడమే విచిత్రం. అన్నా కొణిదెల వచ్చి, జగన్‌కు ఇన్ని తిప్పలు తెచ్చారన్నమాట!

LEAVE A RESPONSE