Suryaa.co.in

Family

వృద్ధులు

వృద్ధులు అవరు బద్ధులు
ఉపకారము నకు బద్ధులు

సత్ సలహాలు ఇచ్చుటలో సఖులు
బ్రతుకు భాగవతం వినిపించే శుకులు

బోధలు చెప్పుటలో బుద్ధులు
బోలెడు అనుభవాల బుద్ధులు

శాస్త్ర పరిజ్ఞానం లో సిద్ధులు
శాంత, సంయమములకు సిద్దులు

పలు అంశాల యందు పండితులు
సందేశాలు అందించే స్నేహితులు

ఈ వేగ యాంత్రిక కాలానికి కాదు బీదలు
జీవన సంగ్రామం చేసి అలసిన భీష్ములు

యువకుల విజయాలకు యుక్తులు
యుగ,యుగాలకు స్వశక్తులు

వృద్ధులు అవరు వ్యర్ధులు
కల్ప వృక్షాల వంటి వ్యక్తులు

చింతపల్లి వెంకటరమణ

LEAVE A RESPONSE