అంగన్వాడి ఆడపడుచులు రోడ్డుపై కూర్చుంటే జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా అంగన్వాడి మహిళలు రాష్ట్ర ప్రభుత్వం వారికి సమస్యలను పరిష్కరించాలంటూ చేస్తున్న దీక్షకు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో కలసి వారి దీక్షకు సంఘీభావం తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఏమైపోయారు? గత 21 రోజులుగా అంగన్వాడి మహిళలు వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జగన్ రెడ్డి దృష్టికి అధికార పార్టీ నేతలు ఎందుకు తీసుకు వెళ్ళలేక పోతున్నారు? జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఒక నియంతలా పరిపాలన చేస్తున్నాడు.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్ సదుపాయాలు కల్పించాలి.

కుటుంబాలను సైతం విడిచి వారి సమస్యల పరిష్కారం కోసం రోడ్డుకెక్కిన అంగన్వాడి మహిళల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటూ వారి కుటుంబాలకి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Leave a Reply