Suryaa.co.in

Telangana

కుమారి ఆంటీ కి ఒక రూల్..మిగతా ప్రజలకి ఒక రూలా ?

– జీహెచ్‌ఎంసి కమీషనరా ? లేక రేవంత్ రెడ్డి కి కమీషనరా ?
– జానారెడ్డి ఇల్లు కూల్చుతున్నారా ?
– బీ ఆర్ ఎస్ మహిళా కార్పొరేటర్లు మన్నె కవిత రెడ్డి ,రాసురి సునీత, దేదీప్య,హేమ సామల

హైదరాబాద్: ఎన్నడూ లేని విధంగా మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా రేవంత్ రెడ్డి సూచనల మేరకు బిఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గం ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చౌరస్తా బసవ తారకమ్ ఆస్పత్రి విషయంలో కాన్సర్ హాస్పిటల్ దగ్గర రోడ్ విస్తరణ చేస్తున్నప్పుడు, జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ చేస్తున్నప్పుడు జానారెడ్డి అడిగారు. నాది 500 గజాల ప్లాట్ పోతది ,నేను అవసరమైతే రేవంత్ రెడ్డి తో మాట్లాడుతా అని చెప్పిన కూడా వినిపించుకోలేదు, అని స్వయంగా జానారెడ్డి చెప్పారు.

బసవ తారకం హాస్పిటల్ దగ్గర తీసే ముందు జానారెడ్డి వాళ్ల ఇల్లు కూల్చుతున్నారా ?వారికి ఏమైనా నోటీసులు ఇచ్చారా అని అడిగితే ఇవ్వలేదు అని సమాధానం ఇచ్చారు. కేబీఆర్ పార్క్ రోడ్ల విస్తరణ ఎజెండా జీహెచ్‌ఎంసి బడ్జెట్ సెషన్ లో 1090 కోట్ల రూపాయలతో వద్దు అన్న వినకుండా రోడ్స్ వైడెనింగ్స్ తీసుకుంటున్నారు స్ట్రీట్ వెండార్స్ గురించి మాట్లాడితే కుమారి ఆంటీ కి ఒక రూల్, మిగతా ప్రజలకి ఒక రూలా ? వేండొర్స్ మేము 12 సంవత్సరల నుండి మేము ఇక్కడే బ్రతుకుతున్నాము అని వేడుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు విడిచిపెట్టలేదు మొత్తం కూల్చేశారు .

జీహెచ్‌ఎంసి తరుపున మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ప్రతి డివిజన్ కి 2 బస్తీ దవాఖానలు మంజూరు చేశారు. బస్తి దవాఖానలో సిబ్బంది కి జీతాలు ఇవ్వలేక మందులు కూడా ఇవ్వలేక పోతున్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు.. బడ్జెట్ పెట్టేది జీతాలు ఇవ్వడం కోసమే. నిధులు ఇవ్వడానికి కాదు అంటున్నారు జీహెచ్‌ఎంసి కమిషనర్ దగ్గరకు మేము వెళ్తే పట్టించుకోవడం లేదు. కమిషనర్ ని కలవాలంటే 2 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి.

జీహెచ్‌ఎంసి కమీషనరా …లేక రేవంత్ రెడ్డి కి కమీషనరా అని మేము అడుగుతున్నాం. మేము మా కార్పొరేషన్ ఇబ్బందులు చెప్పుకోవడానికి కూడా మాకు సమయం ఇవ్వలేదు. CRMP స్వీపెంగ్ మెషిన్లు వాడకుండా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసి నిధులు వృథా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్నవారిని బి ఆర్ ఎస్ పార్టీ లో ఉన్నట్టుగా చూపిస్తున్నారు.

స్ట్రీట్ వెండర్స్ గురించి మాట్లాడానికి నేను వెళ్తే మేయర్ నన్ను చుప్ గా ఉండు సునీత అని చెప్తున్నారు. దళిత కార్పొరేటర్నైన నన్ను పట్టుకొని నువ్వు అని మర్యాద లేనట్టుగా మేయర్ మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యి ఉండి, రైల్వే జాగాలు 100 సంవత్సరాలు లీజుకు ఇస్తున్నారు. ఎవరు బ్రతుకుతారు ఇలా ఇస్తే ?

బిఆర్ఎస్ పార్టీ లో నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ లోకి పోయి మా కార్పొరేటర్ల సమస్యలను వినిపించుకోవడం లేదు. ఏ వార్డ్ కి కూడా నిధులు మంజూరు చేయడం లేదు. బీఆర్‌ఎస్
మహిళా కార్పొరేటర్ల పై పురుష కార్పొరేటర్లు దాడులు చేస్తే కనీసం మేయర్ ఖండించడం లేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ పోడియం ముందుకి వెళ్లి బీఆర్‌ఎస్  కార్పొరేటర్ల దగ్గర ఉన్న ప్ల కార్డులు గుంజుకొని మేయర్ మీద విసిరారు .వాళ్ళు విసిరి మా మీద గొడవ చేస్తున్నట్టు ఒక ప్లాన్ వేసి మమ్మల్ని అరెస్ట్ చేయించారు. కెసిఆర్ మీ డాడీ మీద ఉన్న గౌరవం తో, మీకు బీసీ మహిళ అని మేయర్ గా అవకాశం కల్పించారు.

LEAVE A RESPONSE