– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు
విజయవాడ: రాష్ట్రంలో వాట్స్ అప్ గవర్నెన్స్ సేవలు స్వాగతిస్తున్నాం.. రాష్ట్రంలో అభివృద్ధి వేగం పెరిగింది.. ముఖ్య మంత్రి చంద్రబాబు హృదయం విశాలమైనది అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అభినందనలతో ముంచెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు.
విశాఖ స్టీలు, దేశ వ్యాప్తంగా 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ఉన్నాం. ఇవాళ విశాఖ స్టీల్‌ను కేంద్ర మంత్రులు పరిశీలిస్తున్నారు. స్టీలు ప్లాంటు ప్యాకేజీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇక, పార్టీ బలోపేతానికి చేరికలపై కూడా దృష్టి పెట్టాం. కేంద్ర స్ధాయిలో చేరికలు జరుగుతున్నాయి. పార్టీ లో చేరికలు నిరంతర ప్రక్రియ.
అన్నా హజారే తో దీక్ష చేసి ఆయనకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేజ్రీవాల్. కమ్యూనిస్ట్ లు వల్ల అభివృద్ధి జరగదు… వారు ఏలిన రాష్ట్రంలో అభివృద్ధి లేదు. కార్యక్రమంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, పూడి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.