Suryaa.co.in

Andhra Pradesh

కార్యకర్తల సంక్షేమ నిధి కోసం రూ. 25 లక్షల విరాళం

– చెక్కును మంత్రి లోకేష్‌కు అందించిన మాదాల చైతన్య

ఉండవల్లి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కోసం జన చైతన్య శ్రేష్ట గ్రూప్స్ అధినేత మాదాల చైతన్య రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆ చెక్కును గురువారం ఉండవల్లిలోని మంత్రి లోకేష్ కు అందజేశారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని చైతన్య కొనియాడారు. పార్టీ ఖర్చు చేసే ప్రతి పైసా కార్యకర్తల సంక్షేమానికి దోహదపడుతుందని నమ్మకంతో తాను చెక్కును అందిస్తున్నట్టు తెలిపారు.

పార్టీ మనకు ఏమిచ్చిందని కాకుండా పార్టీకి మనం ఏమి చేశామనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చైతన్య పిలుపునిచ్చారు. 74 ఏళ్ల వయసులో సైతం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్ కు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీకి విరాళంగా 25 లక్షల రూపాయలు ఇవ్వడాన్ని అభినందిస్తూ, మాదాల చైతన్య భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువ కావాలని మంత్రి కోరారు.

LEAVE A RESPONSE